Pinaki Bhattacharya: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా రాజీనామా చేసి, దేశం వదిలిపారిపోయేలా చేసేందుకు కుట్ర జరిగిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. షేక్ హసీనాను భారత్ కీలుబొమ్మగా పోలుస్తూ, అడుగడుగున భారత వ్యతిరేకత నింపుకున్న వ్యక్తి ‘పినాకి భట్టాచార్య’. ఫ్రాన్స్‌లో ఉంటున్న ఇతను అక్కడ నుంచే షేక్ హసీనాకు వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ దేశంలో అగ్గిరాజేందుకు కీలకంగా వ్యవహరించాడు. పేరుకు మాత్రమే హిందువు. అయితే, ఇతను తబ్లిగీ జమాత్ ప్రభావంతో ఇస్లాం స్వీకరించినప్పటికీ, పేరు మాత్రం మార్చుకోలేదు.
విద్యార్థి ఆందోళన, ఈ రిజర్వేషన్ల కన్నా ముందే అతను మాల్దీవుల లాగా బంగ్లాదేశ్‌లో ‘ఇండియా అవుట్’ ప్రచారాన్ని ప్రారంభించేందుకు కారణమయ్యాడు. ఇతని ఇండియా అవుట్ ఉద్యమానికి బంగ్లాదేశ్‌లో భారీ ప్రచారం జరిగింది. అతను పోస్ట్ చేసే యూట్యూబ్ వీడియోలకు వ్యూస్ లక్షల్లో రావడంతో, అక్కడి హిందూ, భారత వ్యతిరేక శక్తుల ఏకీకరణ జరిగింది. ముఖ్యంగా హసీనా శత్రువులైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ), జమాతే ఇస్లామీ పార్టీలు ఇండియా అవుట్ ఆందోళనల్లో పాల్గొన్నాయి.
Read Also: Rash Car Driving: అతివేగంతో కారు నడుపుతూ మూడు బైకులను ఢీకొట్టిన మైనర్ బాలుడు..
తాజాగా రిజర్వేషన్ కోటా విషయంలో కూడా ఈ రెండు పార్టీలే కీలకంగా వ్యవహరించాయి. గతంలో ఇండియా అవుట్ ప్రచారం సమయంలో అప్పటి ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా ఉత్పత్తులను బహిష్కరిస్తే, మీ భార్యలు ధరించే ఇండియా తయారీ చీరలను కూడా తీసేయాలని అని, ఈ ఉద్యమం చేస్తున్న వారిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రచారమే, ఇటీవల రిజర్వేషన్ కోటాకు అవసరమైన నిప్పును అందించాయి. దీంతో బంగ్లాదేశ్ తగలబడి పోయింది. హిందూ పేరుతో చలామణీ అవుతున్న ‘‘పినాకి భట్టాచార్య’’ కారణంగా అక్కడి మతోన్మాద శక్తుల చేతుల్లో బంగ్లా హిందువులు హతమవుతున్నారు. హిందూ మహిళలు అకృత్యాలకు గురవుతున్నారు.
Read Also: English Teacher: తనపై రేప్ జరిగిందన్న ఇంగ్లీష్ టీచర్.. 19 ఏళ్ల యువకుడి ఆత్మహత్య..
బంగ్లాదేశీయుడైన ఈ పినాకిని భట్టాచార్య మెథాంఫేటమిన్, కెఫిన్ మిశ్రయం కలిగిన యాబాతో సహా నకిలీ మందుల్ని తయారు చేస్తున్నాడనే ఆరోపణలపై హసీనా సర్కార్ ఇతడిపై దర్యాప్తు ప్రారంభించింది. దీంతో ఇతను బంగ్లాదేశ్ నుంచి పారిపోయి ఫ్రాన్స్‌లో తలదాచుకున్నాడు. యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా ద్వారా హిందువులు, భారత వ్యతిరేక కథనాలను ప్రచారం చేశాడు. ఇతడికి జమాతే ఇస్లామి, ఆల్-ఖైదాతో సంబంధాలు కూడా ఉన్నాయి. ఇదే కాకుండా అమెరికా, ఇజ్రాయిల్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ దేశాల్లో లౌకికవాద శక్తులకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తాడు. జమ్మూ కాశ్మీర్‌తో పాటు భారతదేశంలోని ఇతన ప్రాంతాల్లో పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుంటాడు. ఆఫ్ఘాన్ తాలిబాన్లకు మద్దతు తెలుపుతుంటాడు.
భట్టాచార్య తండ్రి ఓ పాఠశాల ఉపాధ్యాయుడు, రచయిత అయిన శ్యామల్ భట్టాచార్య. తన కుమారుడు ఇస్లాం స్వీకరించడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. దీంతో తండ్రి శ్యామల్‌తో పినాకిని సంబంధాలు తెగిపోయాయి. 1992లో రాజ్‌షాహి మెడికల్ కాలేజీ నుంచి పట్టభద్రుడైన జమాతే ఇస్లామి కార్యక్రమాలలో చురుకుగా పాలుపంచుకున్నాడు. పాకిస్తానీ గూఢచారి సంస్థ ఇంటర్-సర్వీస్ ఇంటెలిజెన్స్ (ISI)తో పినాకికి ఉన్న అనుబంధం మరియు ఇస్లామిస్టులు, జిహాదీలు మరియు ఉగ్రవాదులతో అతని సంబంధాల గురించి తెలుసుకున్న వైద్యురాలైన ఇతడి భార్య కూడా దూరంగా ఉంది.