Air India: ఎయిర్ ఇండియా విమానంలోకి ఓ పైలెట్ తన స్నేహితురాలిని కాక్‌పిట్ లోకి తీసుకెళ్లిన ఘటనలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) చర్యలు తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించినందుకు పైలెట్ పై మూడు నెలల సస్పెన్షన్ విధించింది. దీంతో పాటు ఎయిర్ ఇండియాకు రూ. 30 లక్షల ఫైన్ విధించింది. ఈ విషయంలో జాప్యం జరిగినందుకు ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంపెబ్ విల్సన్ తో పాటు ఎయిర్ ఇండియా భద్రత, రక్షణ, నాణ్యత చీఫ్ ఆఫీసర్ కు సైతం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటన ముగిసే వరకు విమానంలో ఉన్న సిబ్బందిని విధులకు దూరంగా ఉంచాలని ఎయిర్ ఇండియ సంస్థకు సూచించింది.
Read Also: Pavala Shyamala: బండ్ల గణేష్ తోసేస్తే.. పవన్ పరిగెత్తుకుంటూ వచ్చి.. దండం పెట్టి
ఫిబ్రవరి 27న దుబాయ్ నుంచి ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో పైలట్ తన స్నేహితురాలని కాక్‌పిట్ లోకి తీసుకెళ్లడమే కాకుండా ప్రయాణమంతా ఆమెను అక్కడే కూర్చోబెట్టుకున్నాడు. దాదాపుగా 3 గంటల పాటు ఆమె అక్కడే ఉంది. విమానం టేకాఫ్ కు ముందు ప్రయాణికుల్లో తన స్నేహితురాలు ఉందని గుర్తించిన పైలట్, విమానం టేకాఫ్ అయిన తర్వాత ఆమెను కాక్‌పిట్ లోకి రమ్మని ఆహ్మానించాడు. ఆమె అక్కడే అబ్జర్వర్ సీట్ లో కూర్చుంది. తన స్నేహితురాలికి కాక్ పిట్ లోకే భోజనం తీసుకురావాలని, అన్ని మర్యాదలు చేయాలని క్యాబిన్ సిబ్బందిని సదరు పైలట్ ఆదేశించారు. అయితే సిబ్బందిలో ఒకరు దీనికి అభ్యంతరం తెలపడంతో పైలట్ దురుసుగా ప్రవర్తించినట్లు తేలింది. ఈ విషయంపై క్యాబిన్ క్రూలో ఒకరు డీజీసీఏకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
