NTV Telugu Site icon

Amit Shah: “పైలట్ జీ మీ నంబర్ ఎప్పుడూ రాదు”.. రాజస్థాన్ కాంగ్రెస్ పోరుపై అమిత్ షా వ్యాఖ్యలు..

Amit Shah

Amit Shah

Amit Shah: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతం అవుతున్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలెట్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇదిలా ఉంటే ఈ అంతర్గత పోరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ భరత్ పూర్ లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. రాజస్థాన్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అవినీతికి కేంద్రంగా మార్చారని ఆరోపించారు. సచిన్ పైలెట్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నిధిని నింపడంలో అశోక్ గెహ్లాట్ సహకారం ఎక్కువ కాబట్టి మీకు ఎప్పటికీ సీఎంగా అవకాశం రాదని, గెహ్లాట్ ను కాదని మీ నెంబర్ ఎప్పుడూ రాదని ఆయన అన్నారు.

Read Also: IPL 2023 RCB Vs DC: ఆర్సీబీ బౌలర్ల హవా..ఢిల్లీపై బెంగళూర్ ఘన విజయం..

రాజస్థాన్ ప్రభుత్వాన్ని అత్యంత అవినీతి ప్రభుత్వంగా అమిత్ షా దుయ్యబట్టారు. దోచుకున్న డబ్బంతాా కాంగ్రెస్ పార్టీ సంపదగా మారుతోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని, మూడోంతుల మెజారిటీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొడతారని ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్ లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 25 స్థానాల్లో విజయం సాధిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మత కలహాలు, మహిళల పట్ల అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తించడం, దళితులపై అత్యాచారాలతో రాజస్థాన్ లో ప్రభుత్వం నడుస్తోందని దుయ్యబట్టారు.

ఇటీవల బీజేపీ నేత, మాజీ సీఎం వసుంధర రాజే అవినీతిపై చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రస్తావిస్తూ సచిన్ పైలెట్ దీక్ష చేపట్టారు. దీంతో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ల మధ్య మరోసారి విభేదాలు బయటకు వచ్చాయి. ఈ సమస్యను సద్దుమణిగేలా చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది.