NTV Telugu Site icon

Mumbai: 8వ తరగతి విద్యార్థినిపై తోటి స్టూడెంట్స్ సామూహిక అత్యాచారం

Mumbai Incident

Mumbai Incident

Physical assault on minor girl in mumbai: దేశంలో రోజుకు ఎక్కడో చోట అత్యాచారాల ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వావీ వరసలు, చిన్నా పెద్ద అనే తారతమ్యాలు మరిచి మృగాళ్లు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే స్కూల్ లో చదువుకునే మైనర్ విద్యార్థులు కూడా ఈ నేరాలకు పాల్పడుతుండటం కలవరపెడుతోంది. ఇటీవల హైదరాబాద్ లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. తోటి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.

Read Also: Koyyur Encounter: మావోయిస్టు చరిత్రలో నెత్తుటి జ్ఞాపకం.. కొయ్యూర్ ఎన్‌కౌంటర్‌కు 23 ఏళ్లు

ఇదిలా ఉంటే ఆర్థిక రాజధాని ముంబైలో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. సహ విద్యార్థులే, విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు. 8వ తరగతి చదువుతున్న బాలికపై అదే క్లాసుకు చెందిన ఇద్దరు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 13 ఏళ్ల విద్యార్థినిపై ఇద్దరు బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. క్లాస్ రూములోనే ఈ ఘటన జరిగింది. ఈ అఘాయిత్యం తర్వాత బాలిక తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పడంతో వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ముంబైలోని ఓ స్కూల్ లో ఇద్దరు బాలురు, 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ఈ ఘటన సోమవారం జరిగినట్లు తెలిపారు. డాన్స్ ప్రాక్టీస్ కోసం తోలి క్లాస్‌మేట్స్ క్లాస్‌రూమ్ నుండి బయటకు వచ్చినప్పుడు, ఇద్దరు సహవిద్యార్థులు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బాలిక, నిందితులంతా 8వ తరగతి చదువుతున్న మైనర్లే. తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా ఇద్దరిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. మైనర్ నిందితులను జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. దక్షిణ ముంబైలోని జువైనల్ డిటెన్షన్ సెంటర్కు నిందితులను పంపించారు.