Site icon NTV Telugu

సెంచరీ దాటిన.. ఆగని పెట్రో బాదుడు

ఇప్పటికే దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. పెట్రోల్ ధరలు సెంచరీ దాటినా ధరల పరుగులు మాత్రం ఆగడంలేదు. ఇక డీజిల్ కూడా సెంచరీకి సిద్దమవుతుంది. తాజా పెంపుతో సెంచరీదాటిన పెట్రోల్ రాష్ట్రాల్లో తమిళనాడు కూడా చేరిపోయింది. ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్​కు 36 పైసలు.. డీజిల్ ధర 26 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.32 కాగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.70 కు చేరింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌ రూ.98.11, డీజిల్‌ ధర రూ.88.65గా ఉంది. ఇప్పటికే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, జమ్మూకశ్మీర్‌, ఒడిశా, లద్దాఖ్‌ లో పెట్రోల్‌ ధర సెంచరీ దాటేసిన విషయం తెలిసిందే.

Exit mobile version