మన దేశంలో పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరగడం తప్ప… తగ్గుదల అసలు కనిపించడంలేదు. పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 35 పైసలు, లీటర్ డీజిల్ పై 27 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.91 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.88 కు చేరింది.
read also : బంగాళాఖాతంలో అల్పపీడనం : తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.93 చేరగా.. డీజిల్ ధర రూ. 97.46 కు చేరింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.87 చేరగా.. డీజిల్ ధర రూ. 97.96 కు చేరింది. ఇటు ఏపీలోని కొన్ని జిల్లాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టిన సంగతి తెలిసిందే. విజయవాడ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ ధర రూ. 106.93 కాగా డీజిల్ ధర రూ. 99.46 గా నమోదైంది. ఇక గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.13 కాగా డీజిల్ ధర రూ. 99.66 గా నమోదైంది.
