NTV Telugu Site icon

Petrol Dealer Association: మే 31 నుంచి పెట్రోల్, డిజిల్ కొనం.

Bunk

Bunk

పెట్రోల్ పంప్స్ డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. మే 31న 24 రాష్ట్రాల్లోని 70,000 ఔట్‌లెట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి ఇంధనం కొనుగోలు చేయడం లేదని పెట్రోల్ పంప్ డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలో సోమవారం సమావేశం అయిన డీలర్ అసోసియేషన్ ఈ  కీలక నిర్ణయం తీసుకున్నారు. చమురు కంపెనీల నుంచి ఇంధనం కొనుగోలు చేయవద్దని ప్రతినిధులు చర్చించారు. అయితే గత 5 ఏళ్లుగా డీలర్ మార్జిన్లు పెంచలేదని.. ప్రభుత్వం చేసిన ఎక్సైజ్ డ్యూటీ సవరణల వల్ల నష్టాలపై చర్చించారు.

గత ఐదేళ్లుగా చమురు కంపెనీలు డీలర్ మార్జిన్ లను పెంచనప్పటీకీ, పెట్రోల్ పంపుల యాజమాన్యం, నిర్వహణ ఖర్చులు పెరిగాయని అసోసియేషన్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం చివరి సారిగా 2017లో డీలర్ మార్జిన్ లను పెంంచిందని.. ఆ తరువాత చమురు కంపెనీలు, డీలర్ అసోసియేషన్లు 6 నెలల వారీగా డీలర్ మార్జిన్ సవరణ ఉంటుందని అంగీకరించినప్పటికీ దానిని కంపెనీలు అనుసరించలేదని డీలర్ అసోసియేషన్ ఆరోపించింది. డీలర్ మార్జిన్ 5 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తోంది డీలర్ అసోసియేషన్.

ఖర్చులు పెరిగినప్పటికీ 2017 నుంచి డీలర్ మార్జిన్ 2 శాతం నుంచి పెంచలేదని.. దీంతో జీతాలు, విద్యుత్ బిల్లులు, బ్యాంకు ఛార్జీలు మొదలైన ఖర్చులు పెరిగాయని డీలర్ అసోసియేషన్ చెబుతోంది. అధిక ఖర్చుల వల్ల చిన్న పంపులను దివాాలా అంచుకు నెట్టేశాయని అసోసియేషన్ అంటోంది. ఎక్సైజ్ తగ్గింపు వల్ల కలిగిన డీలర్ నష్టాలను తిరిగి చమురు సంస్థలు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఎక్సైజ్ తగ్గింపు వల్ల తమపై విపరీతమైన భారం పడిందని.. ఎక్కువ ధరకు చమురును కొనుగోలు చేసిన తర్వాత తక్కువ ధరకు విక్రయించడం వల్ల లక్షల్లో నష్టాలు వాటిల్లాయని డీలర్ అసోసియేషన్ అంది.