New Parliament Building: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై సుప్రీంకోర్టులో పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం దేశవ్యాప్తంగా రాజకీయ రచ్చకు కారణం అవుతోంది. ఇప్పటికే 21 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. ఈ నెల 28న ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం కానుంది. అయితే దీనిని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం అంటే అవమానించినట్లు అని వ్యాఖ్యానిస్తున్నాయి.
Read Also: Sydney: సిడ్నీలో ఘోర అగ్నిప్రమాదం.. కుప్పకూలిన 7 అంతస్తుల భవనం
Also Read
- Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
- West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇదిలా ఉంటే ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మే 28న కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ, ఆదివారం జరిగే కార్యక్రమానికి ఆమెను దూరంగా ఉంచడం రాష్ట్రపతిని అవమానించినట్లేనని వాదిస్తూ ఒక న్యాయవాది గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయవాది సీఆర్ జయ సుకిన్ గురువారం దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టేందుకు వెకేషన్ బెంచ్ ముందు ప్రస్తావించే అవకాశం ఉంది.
రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్ సభలతో పార్లమెంట్ ఏర్పడుతుందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 సూచిస్తుందని.. లోక్ సభ సెక్రటేరియట్, కేంద్రప్రభుత్వం ఆర్టికల్ 79ని ఉల్లంఘించారని న్యాయవాది తన పిటిషన్ లో పేర్కొన్నారు. రాష్ట్రపతి పార్లమెంట్ లో అంతర్భాగం అని ఆర్టికల్ స్పష్టంగా తెలియజేస్తుందని తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఆమెను ఆహ్వానించకుండా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం చట్టప్రకారం జరగదని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కొత్తపార్లమెంట్ ప్రారంభోత్సవానికి అకాలీదల్, నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీ హాజరవుతామని తెలిపాయి.
తాజావార్తలు
-
SBI Apprentice Recruitment 2026: ఎస్బీఐలో 7150 పోస్టులు.. మంచి జీతం.. అర్హతలు, ఎంపిక పూర్తి వివరాలు
-
Mega 158: ‘మెగా’ డాటర్ ఫిక్స్.. సినిమాకే హైలైట్ అవ్వనుందా!
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పైపైకి.. ఈరోజు తులం ఎంతంటే?
-
Summer Foods for Kids: డీహైడ్రేషన్‌కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్‌టైమ్ రికార్డ్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!