Site icon NTV Telugu

Morbi Bridge Collapse: వంతెన కూలిన ఘటనపై విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్

Supreme Court

Supreme Court

Petition in Supreme Court on Gujarat bridge collapse incident: గుజరాత్ లోని మోర్బీ వంతెన కూలిన ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మచ్చు నదీ అందాలను తిలకించేందుకు వెళ్లిన చాలా మంది మరణించారు. సామర్థ్యాన్ని మించి పెద్ద ఎత్తున జనాలు తీగల వంతెనపైకి చేరుకోవడంతో వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 141 మంది మరణించారు. దీపావళి హాలీడేస్, వీకెండ్ కావడంతో ఆదివారం సాయంత్ర పెద్ద ఎత్తున జనాలు ఈ బ్రిడ్జ్ వద్దకు వెళ్లారు. మరమ్మతులు చేసి తిరిగి ప్రారంభించిన ఐదు రోజులకే బ్రిడ్జ్ కూలింది.

Read Also: Sound Of Earth’s Magnetic Field: భూ అయస్కాంత క్షేత్ర శబ్ధాలు విన్నారా..? ఎంత భయంకరంగా ఉందో వినండి..

ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం 9 మందిని అరెస్ట్ చేసింది. విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది. ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు( మంగళవారం) మోర్బీ ఘటన స్థలాన్ని సందర్శించనున్నారు. బాధితులను పరామర్శించనున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో మరణించిన వారికి రూ.2 లక్షలు, గాయపడిని వారికి రూ.50,000 చొప్పున పరిహారాన్ని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. గుజరాత్ ప్రభుత్వం కూడా మరణించిన వారికి రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 పరిహారాన్ని ప్రకటించింది.

ఇదిలా ఉంటే మోర్బీ వంతెన కూలిన ఘటన సుప్రీం కోర్టుకు చేరింది. ఈ ప్రమాదంపై రిటైర్డ్ జడ్జితో తక్షణమే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. పర్యావరణ సాధ్యత, భద్రతను నిర్దారించేందుకు పాత వంతెనలను, స్మారక కట్టడాలను సర్వే, రిస్క్ అసెస్మెంట్ కోసం కమిటీని ఏర్పాటు చేయాడానికి రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు.

Exit mobile version