NTV Telugu Site icon

Pune: హాట్ కేకుల్లా అపార్ట్మెంట్లు.. కొనేందుకు 8 గంటల పాటు క్యూలో పడిగాపులు.. వీడియో వైరల్..

Apartment

Apartment

Pune: సొంతింటి కల అనేది సామాన్యుడి జీవిత ఆశయం. నానా కష్టాలు పడైనా సొంత ఇళ్లు ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలు తమ స్థోమతకు మించి స్థలాలు, అపార్ట్మెంట్లు కొనుగోలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే ఇక మెట్రో నగరాల్లో ఉండే వారు తమకంటూ ఓ అపార్ట్మెంట్ ఉండాలని అనుకుంటారు.దేశంలోని ముఖ్యమైన నగరాల్లో రోజు రోజుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది. ఒకసారి అపార్ట్మెంట్ కొనుగోలు చేస్తే, వచ్చే ఏడాది మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని చాలా మంది అనుకుంటున్నారు.

READ ALSO: BAN vs NED: బంగ్లాదేశ్ ముందు స్వల్ప లక్ష్యం.. 229 పరుగులకు నెదర్లాండ్ ఆలౌట్

ప్రజల సొంతింటి కల ఎంతలా ఉంటుందనే దానికి పూణేలో జరిగిన ఈ సంఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. ఇటీవల పూణేలోని నివాసితులు రూ. 1.5-2 కోట్ల విలువైన అపార్ట్మెంట్లు కొనుగోలు చేసేందుకు ఏకంగా 8 గంటలు క్యూలో నిల్చుకున్నారు. ప్రధాన నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాకాద్ ప్రాంతంలో ఈ దృశ్యం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఒకరు ఇల్లు కొనుగోలు చేయడానికి 8 గంటలు వేచి ఉండటానికి సిద్ధంగా ఉన్నారా..? అంటూ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ‘‘ఇలా ఎప్పుడూ లేదు.. రూ. 1.5-2 కోట్లు అకౌంట్లో ఉన్నవారు అక్కడ నిలబడి ఉన్నారని నేను అనుకోను. వారిలో ఎక్కువ మంది బ్యాంకు వ్యాపారం బాగుండాలని నిలబడ్డారు’’ అని ఎక్స్ లో మరో నెటిజన్ సెటైర్లు వేశారు. నమ్మడానికి కష్టంగా ఉంది, ఇది మార్కెటింగ్ వ్యూహం కావచ్చని మరొకరు అనుమానించారు.