People No Need To Panic On 2000 Note Withdrawn: రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు శుక్రవారం సాయంత్రం ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే! ఈ ప్రకటన రావడమే ఆలస్యం.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? చేతిలో ఉన్న రూ.2 వేల నోట్లు ఎలా మార్చుకోవాలి? అసలు ఇవి చెల్లుతాయా? అంటూ కంగారు పడుతున్నారు. అయితే.. ప్రజలు ఈ 2 వేల నోటు రద్దు విషయంపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం.. ఈ 2 వేల నోట్లు సెప్టెంబర్ 30వ తేదీ వరకు చెల్లుబాటు. అంటే.. ఇవి అప్పటిదాకా చలామణీలో ఉంటాయి. ఆలోపు ఈ నోట్లను దగ్గరలో ఉన్న బ్యాంక్‌లలో మార్చుకోవచ్చు.
Power Star VS Young Tiger: ఆయన క్లాస్.. ఈయన మాస్.. డైరెక్టర్లకు దండం పెట్టినా తప్పులేదురా
ఖాతా ఉన్నవారు నేరుగా తమ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవడమో లేక రూ.2 వేల నోటు ఇచ్చి తిరిగి రూ.500, రూ.100 నోట్ల రూపంలో తిరిగి పొందవచ్చు. బ్యాంక్‌ల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనూ ఈ నోట్లను మార్చుకోవచ్చు. దీనికితోడు.. రూ.2 వేల నోట్ల జారీని నిలిపివేయాలని బ్యాంక్‌లకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి.. ఇకపై ఏటీఎంలలో ఇవి అందుబాటులో ఉండవు. అలాగే.. బ్యాంక్‌ల్లో డబ్బులు విత్‌డ్రా చేసినప్పుడు, బ్యాంక్‌వాళ్లు ఈ రూ.2 వేల నోట్లు మనకు ఇవ్వరు. మన దగ్గర ఉన్న వాటిని బ్యాంక్‌ల్లో మార్చుకుంటే సరిపోతుంది. అయినా.. ఈ రూ.2 వేల నోట్లు ఈమధ్య ఎక్కువగా కనిపించడం లేదు. సామాన్య ప్రజల వద్ద అయితే అస్సలు లేనే లేవు. ఏటీఎంలలో గరిష్టంగా రూ.500, రూ.100 నోట్లే ఉన్నాయి. 2018-19 నుంచే ఆర్బీఐ ఈ 2 వేల నోట్ల ముద్రణను నిలిపివేసింది కాబట్టి.. ఇప్పుడు చలామణీలో చాలా తక్కువ నోట్లే ఉన్నాయి. ఆర్బీఐ లెక్కల ప్రకారం.. 2023 మార్చి 31 నాటికి 10.8 శాతం మాత్రమే ఈ నోట్లు అందుబాటులో ఉన్నాయి.
RBI website crash: రూ. 2,000 నోటు రద్దు తర్వాత RBI వెబ్‌సైట్ క్రాష్
కాకపోతే.. ఆర్బీఐ ప్రకటన ప్రకారం ఈ 2 వేల నోట్లను రోజుకి 10 మాత్రమే మార్చుకోవడానికి వీలు ఉంటుంది. అంటే.. ఒక్కో విడతలో 20 వేల వరకు మార్చుకోవచ్చు. అయితే.. సెప్టెంబర్ 30 దాకా సమయం ఉంది కాబట్టి, ఆలోపు ఎలాంటి ఆందోళన లేకుండా మార్చుకోవచ్చు. ఈ 2 వేల నోట్ల రద్దు కారణంగా.. 2016 నాని డీమోనిటైజేషన్ పరిస్థితులైతే రావు. తక్కువ మోతాదులోనే 2 వేల నోట్లు చలామణీలో ఉన్నాయి కాబట్టి, సులువుగా ప్రాసెస్ ముగిసిపోతుంది. ఈ 2 వేల నోట్లను మే 23వ తేదీ నుంచి మార్చుకోవచ్చు.