NTV Telugu Site icon

Mohan Bhagwat: భారత్ నుంచి ఎందుకు విడిపోయామా అని పాకిస్తాన్ ప్రజలు బాధపడుతున్నారు.

Mohan Bagwat

Mohan Bagwat

Mohan Bhagwat: స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్ధాలు గుడుస్తున్నా.. పాకిస్తాన్ ప్రజలు సంతోషంగా లేరని అన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్. భారత్ తో ఎందుకు విడిపోయామా అని అనుకుంటున్నారని, భారత్ విభజన పొరపాటుగా భావిస్తున్నారని అన్నారు. శుక్రవారం సింధీ యువవిప్లవకారుడు హేము కలానీ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 1947లో భారత్ నుంచి విడిపోయిన పాకిస్తాన్ ఇప్పుడు సంతోషంగా ఉందా..? అని ప్రశ్నించారు. అక్కడ ప్రజలు బాధ అనుభవిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం పాక్ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అక్కడి ప్రజల పరిస్థితిపై ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది.

Read Also: Stormy Daniels: ట్రంప్‌ను ఇరికించిన శృంగార తార స్టార్మీ డేనియల్స్.. ఆమె జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు..

భారత్ ఎప్పుడూ ఇతరులపై దాడి చేసే సంస్కృతికి చెందింది కాదని, భారత్, పాకిస్తాన్ పై దాడి చేయాలనే ఉద్దేశ్యం లేదని ఆయన అన్నారు. అయితే ఆత్మరక్షణలో సమాధానం చెందే సంస్కృతి నుంచి వచ్చామని భారతీయుల గురించి ప్రస్తావించారు. పాకిస్తాన్ పై జరిగిన సర్జికల్ స్ట్రైక్ గురించి ప్రస్తావిస్తూ.. మేము ఆత్మరక్షణ కోసం దాడులు చేస్తాం, చేస్తూనే ఉంటాం అని అన్నారు. విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చిన ఎక్కువ మందిలో సింధీ కమ్యూనిటీ వారు ఉన్నారు. మీ సుసంపన్నమైన సింధు సంస్కృతి, విలువలను ఆ భారత్ నుంచి ఈ భారత్ కు తీసుకువచ్చారని అన్నారు.

Show comments