NTV Telugu Site icon

US Elections: ఆ ఒక్క రాష్ట్రం మినహా భారతదేశం మొత్తం ట్రంప్ గురించి గూగుల్లో సెర్చ్

Google

Google

US Elections: హోరాహోరీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్ ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ నేత కమలా హారిస్‌పై స్పష్టమైన ఆధిక్యం సాధించారు. ఈ క్రమంలోనే కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు పలు దేశాల నేతలు, అధ్యక్షులు, ప్రధానులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.

Read Also: Rajahmundry Airport: రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్ల కలకలం

అయితే, అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ 6 వరకు గూగుల్ ట్రెండ్స్ డేటా తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రం మినహా మిగతా అన్ని భారతీయ రాష్ట్రాలు కమలా హరీస్ కంటే డొనాల్డ్ ట్రంప్ గురించి గూగుల్ లో ఎక్కువగా శోధించాయని పేర్కొనింది. ఈ విషయాన్ని ఇండియా ఇన్ పిక్సెల్స్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపింది. కాగా, అధ్యక్ష ఎన్నికల్లో పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియా, ఒహియో, ఫ్లోరిడా, టెక్సాస్, కెంటకీ, టేనస్సీ, ఉటా వంటి రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. అలాగే, ట్రంప్ కు 295 ఎలక్టోరల్ ఓట్లు రాగా.. కమలా హరీస్ కు 226 ఎలక్టోరల్ ఓట్ల వచ్చాయి.

Show comments