NTV Telugu Site icon

Sharad Pawar: తెల్లవారుజామునే శరద్‌ పవార్‌ ఇంటి ముందు బారులు తీరిన జనం..

Sharadh Pawar

Sharadh Pawar

ఈరోజు (శనివారం) తెల్లవారుజామునే నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ఇంటి దగ్గర జనం భారీగా గుమిగూడారు. బారామతిలోని ఆయన నివాసం ముందు జనం పూల బొకేలతో ఎదురు చూస్తున్నారు. దివాళీ పడ్వ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఎన్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇక, మహారాష్ట్రలో ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగబోతుంది. మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు.

Read Also: Lucky Baskar : రెండో రోజు కూడా సాలీడ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘లక్కీ భాస్కర్’

కాగా, ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ మధ్య ప్రధాన పోటీ కొనసాగుతుంది. రెండు కూటముల్లో మూడేసి పార్టీలు సీట్లు షేర్ చేసుకున్నాయి. ఈ సారి రాష్ట్రంలో మరోసారి అధికారం దక్కించుకోవాలని అధికార- విపక్ష పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లను నవంబర్‌ 23వ తేదీన లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. కాగా ఇవాళ శరద్‌ పవార్‌ ఇంటి ముందు జనం గుమిగూడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Show comments