NTV Telugu Site icon

Pema Khandu: “సూర్యుడు ఉదయించే రాష్ట్రం”లో కమలాన్ని వికసింపచేశాడు..

Pema Khandu

Pema Khandu

Pema Khandu: చైనా సరిహద్దుల్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ అద్భుత విజయం సాధించింది. ఈ రోజు వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 60 సీట్లకు గానూ ఏకంగా 46 సీట్లను కైవసం చేసుకుంది. ఎన్నికల ముందే 10 అసెంబ్లీ సీట్లను ఏకగ్రీవంగా గెలుచుకుంది. వరసాగా మూడో సారి బీజేపీ అరుణాచల్‌లో అధికారంలోకి రాబోతోంది. ఈ విజయానికి కారణంగా ప్రస్తుతం వినిపిస్తున్న పేరు పెమా ఖండూ. రాజకీయ వ్యూహకర్తగా పేరొందిన ఇతను ఈశాన్య రాష్ట్రంలో మొదటిసారిగా బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చాడు.

దేశంలో సూర్యుడు మొదటగా ఉదయించే రాష్ట్రంగా పేరున్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ఓ సూర్యుడిలా పెమా ఖండూ మారారు. 2011లో హెలికాప్టర్ ప్రమాదంలో అతని తండ్రి, మాజీ ముఖ్యమంత్రి దోర్జీ ఖండూ అకాల మరణంతో రాజకీయంగా అరుణాచల్ ప్రదేశ్ నుంచి కీలక వ్యక్తిగా మారారు. 2000లో కాంగ్రెస్‌లో చేరి వివిధ పదవులు చేపట్టినప్పటికీ, తన తండ్రి నియోజకవర్గం ముక్తో నుంచి ఉపఎన్నికల్లో పోటీ లేకుండా గెలిచిన తర్వాత ఆయన ఎదుగుదల వేగంగా సాగింది.

Read Also: MP: భార్యపై అనుమానంతో అతి కిరాతకంగా హతమార్చిన భర్త.. శరీరాన్ని14 ముక్కలు చేసిన వైనం

నబమ్ టుకీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో పర్యాటక మంత్రిగా పనిచేసిన పెమా ఖండూ పనిచేశారు. జనవరి 2016 రాజ్యాంగ సంక్షోభం కారణంగా రాష్ట్రపతి పాలన విధించడానికి దారి తీసింది. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో ఏర్పడి కలిఖోపుల్ నేతృత్వంలోని ప్రభుత్వంలో పెమా ఖండూ మంత్రి అయ్యారు. అయితే, కొంతకాలం మాత్రమే అధికారం కొనసాగింది. సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ నబమ్ టుకీ ప్రభుత్వం మళ్లీ పునరుద్దరించబడింది. ఇతని రాజీనామా తర్వాత 37 ఏళ్ల వయసులో పెమా ఖండూ జూలై 2016లో సీఎం అయ్యారు.

కాంగ్రెస్‌లో ఉన్న పెమాఖండూ 2016లో పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్(పీపీఏ)కి, అదే ఏడాది డిసెంబర్‌లో బీజేపీలో చేరారు. ఇతని పదవీకాలం ప్రారంభమైన మూడు నెలలకే 43 మంది అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ మిత్రపక్షమైన పీపీఏలోకి ఫిరాయించారు. అంతర్గత విభేదాల వల్ల పీపీఏ పెమాఖండూని సస్పెండ్ చేయడంతో, పీపీఏ ఎమ్మెల్యేలతో కలసి బీజేపీలో చేరడంతో మరింత బలపడ్డారు. 2019లో పెమా ఖండూ ముక్తో అసెంబ్లీ స్థానం నుంచి రెండోసారి గెలిచి ఎలాంటి రాజకీయ అవరోధాలు లేకుండా ముఖ్యమంత్రి అయ్యారు.