Site icon NTV Telugu

SpiceJet Flight: ఇంజిన్ లో మంటలు.. పాట్నాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

Spicejet Fire

Spicejet Fire

Patna Spicejet Flight Emergency Landing: స్పైజ్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆదివారం బీహార్ రాజధాని పాట్నా నుంచి ఢిల్లీకి వెళ్లే క్రమంలో స్పైస్ జెట్ విమానం ఇంజిన్ లో సాంకేతిక సమస్య ఎదురైంది. విమానం టేకాఫ్ అయిన తర్వాత ఎడమ ఇంజిన్ ను పక్షి ఢీకొనడం వల్ల మంటలు చెలరేగాయి. దీంతో పైలెట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమాచారం అందించి.. విమానాన్ని పాట్నా ఎయిర్ పోర్టులో తిరిగి ల్యాండ్ చేశారు. ఇంజిన్ కు మంటలు అంటుకోవడంతో ఇంధన సరఫరాను నిలిపివేసి పైలెట్లు ల్యాండింగ్ చేశారు.

ప్రమాదం జరిగిన సమయంలో 185 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రమాదం వల్ల ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. పాట్నా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ మాట్లాడుతూ.. విమానంలో మంటలను స్థానికులు గమనించి జిల్లా అధికారులకు, విమానాశ్రయ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రమాదానికి కారణాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. మంటలను గమనించిన సిబ్బంది వెంటనే ఎడమ ఇంజన్ కు వెళ్లాల్సిన ఇంధన సరఫరాను కట్ చేసి మంటలు వ్యాపించకుండా నిరోధించారు. దీంతో సింగిల్ ఇంజిన్ తో పాట్నా ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు.

 

 

 

Exit mobile version