Site icon NTV Telugu

Patna Crime: బిడ్డ కళ్ల ముందే తల్లిపై ఘోరం.. ప్రత్యక్ష సాక్షి కొడుకే..

Patna Crime Copy

Patna Crime Copy

త‌న క‌న్న‌త‌ల్లిని కుటుంబ‌స‌భ్యులే క‌ర్ర‌ల‌తో.. ఇటుక‌ల‌తో కొట్టి చంపిన‌తీరు అంద‌రిని క‌లిచివేసింది. అమ్మను కొట్ట‌కు అమ్మా.. అంటూ ఆ చిన్నారి ఏడుస్తున్నా క‌ట్నం కోసం వేధించి.. చేసేది ఏమీ లేక ఆమెపై అత్తింటి వారే ఈఘాతుకానికి పాల్ప‌డం సంచ‌ల‌నంగా మారింది. వ‌ర‌క‌ట్నం వేధింపుల‌కు మ‌రో త‌ల్లి బ‌లైంది. ఈ ఘ‌ట‌న పాట్నాలోని ఫ‌తుహా పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది. మృతురాలిని అబ్దల్ చక్, ఫతుహాలో నివాసం ఉంటున్న సోనమ్ దేవిగా గుర్తించారు.

బీహార్ రాష్ట్రానికి చెందిన సోనమ్‌దేవికి ఎనిమిదేళ్ల క్రితం.. జఫ్రాబాద్‌లోని ప్రవీణ్‌చాక్‌కి చెందిన దేవాలాల్‌తో వివాహమైంది. పెళ్లి అయిన కొద్ది రోజులకే భర్త మరణించడంతో భర్త సోదరుడైన సేవాలాల్‌ను సోనమ్‌దేవి వివాహం చేసుకుంది. సోనమ్‌దేవితో వివాహం చేసుకున్న తర్వాత,..సేవాలాల్ కుటుంబసభ్యులు కట్నం కోసం అతడికి మరో వివాహం ఏర్పాటు చేశారు. దీనిని సోనమ్ దేవి తరచుగా వ్యతిరేకిస్తుంది. ఈ విషయమై సోనమ్ తన భర్త, అత్తమామలతో తరచూ గొడవపడేది. ఈ క్రమంలో భర్త సేవాలాల్, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను తరచూ చిత్రహింసలకు గురిచేస్తుండేవారు. ఈ విషయమై స్థానిక ఫతుహా పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు తన భర్తతో సహా అత్తమామలపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేసింది. దీనికి ప్రతీకారంగా అత్తమామలు సోనమ్ దేవిని కర్రలతో కొట్టి, ఇటుకలతో చితకబాది దారుణంగా హత్య చేశారు. ఘటన అనంతరం నిందితులు అత్తమామలు అక్కడి నుంచి తప్పించుకున్నారు.

ఇటుకలు, రాళ్లతో కుటుంబసభ్యులు తన తల్లిని హత్య చేసినట్లు మృతురాలి 6 ఏళ్ల కుమారుడు, ఘటన ప్రత్యక్ష సాక్షి వివేక్‌కుమార్‌ తెలిపాడు. సంఘటనా స్థలంలో ఉన్న ఫతుహా డీఎస్పీ రాజేష్ కుమార్ మాంఝీ.. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగినట్లు నిర్ధారించి, పరారీలో ఉన్న నిందితులందరినీ త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే తల్లి మరణంతో అమ్మా,అమ్మా అంటూ గుక్కపట్టి ఏడుస్తున్న ఆరేళ్ల చిన్నారిని చూసి అక్కడున్నవాళ్లందరూ చలించిపోయారు. ఒక్కసారి లేమ్మా అంటూ ఆ చిన్నారి పలికిన మాటలు అక్కడున్న వాళ్ల కళ్లల్లో క‌నీళ్లు తెప్పించాయి.

AP Cabinet : నేడు ఏపీ కేబినెట్ భేటీ.. దానిపైనే చర్చ..

Exit mobile version