Site icon NTV Telugu

Himachal Pradesh Video: లోతైన లోయలో పడిపోబోయిన వ్యాన్.. తర్వాత ఏమైందంటే..!

Video

Video

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం తప్పింది. పర్యాటక వాహనం లోతైన లోయలో పడిపోబోయింది. అనూహ్యంగా ఒక చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. లేదంటే ఘోర విషాదమే జరిగిపోయేది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హిమాచల్ ప్రదేశ్‌లోని డల్హౌసీ కొండపైకి పర్యాటకులతో వ్యాన్ వెళ్లింది. బ్రేక్ వేయలేదో.. లేదంటే ఏమైందో తెలియదు గానీ అకస్మాత్తుగా వ్యాన్ కిందకు వెళ్లిపోబోయింది. దీంతో భయాందోళనకు గురైన టూరిస్టులు కిందకు దూకేశారు. ఇంతలోనే వ్యాన్ ఒక చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. లేదంటే ఘోర విపత్తు జరిగిపోయి ఉండేది. పర్యాటకులంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వ్యాన్‌లో ఎక్కువగా మహిళలు ఉన్నట్లు కనిపించింది. కింద పడిపోయిన మహిళలను కొందరు పైకి లాగారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

 

Exit mobile version