NTV Telugu Site icon

Partition Horrors Remembrance Day: దేశ విభజన.. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నివాళి

India Partition

India Partition

Partition Horrors Remembrance Day: భారత దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. వజ్రోత్సవ స్వాతంత్య్ర దినోత్సవానికి గుర్తుగా దేశం ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’, ‘ హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అఖండ భారత్ గా ఉన్న భారతదేశాన్ని బ్రిటిష్ వారి కుటిల నీతితో మత ప్రాతిపదికన భారత్, పాకిస్తాన్ గా విభజించారు. భారత్ కన్నా ఒక రోజు ముందే అంటే ఆగస్టు 14, 1947లో పాకిస్తాన్ కొత్త రాజ్యంగా ఏర్పడింది. ఆ రోజు స్వాతంత్య్రాన్ని చూస్తామనుకున్న చాలా మంది మతఘర్షణల కారణంగా రక్తపాతాన్ని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విభజన గాయాలు ఇన్నేళ్లయిన ఇంకా అలాగే ఉన్నాయి. సరిహద్దులకు ఇరువైపులా భారీ నరమేధం జరిగింది.

Read Also: COVID 19: ఇండియాలో తగ్గిన కరోనా కేసులు.. 15 వేల దిగువకు రోజూవారీ కేసులు

ఆగస్టు 14న ‘విభజన్ విభిషిక స్మృతి దివస్’గా జరుపుకుందామని 2021లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అప్పటి నుంచి ఆగస్టు 14న విభజన తాలూకూ గాయాలకు గుర్తుగా.. ఆ ఘర్షణల్లో మరణించిన వారిని నివాళులు అర్పిస్తున్నాము. తాజాగా ఈ రోజు ప్రధాని మోదీ విభజన సమయంలో మరణించిన వారందరికీ నివాళులు అర్పించారు. దేశ విభజన బాధను ఎప్పటికీ మరచిపోలేమని.. నిర్వాసితులైన, ప్రాణాలు కోల్పోయిన ప్రజల పోరాటాన్ని, త్యాగాలను గుర్తు చేసుకునే రోజు అని ప్రధాని అన్నారు. స్వార్థ రాజకీయాలు, వ్యక్తిగ ప్రయోజనాల కోసం దేశ విభజన, అల్లర్లకు ఎలా దారి తీశాయో మనం ఎప్పటికీ మరిచిపోకూడదని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. ఆ సమయంలో జరిగిన ఘోరాలను ఎప్పటికీ మరిచిపోకూడదని అన్నారు.