Site icon NTV Telugu

Chhattisgarh: బీజేపీ అభ్యర్థి గెలుపుపై పందెం.. సగం గుండు కొట్టించుకుని, మీసం కొరిగించుకున్న వ్యక్తి..

Bet

Bet

Chhattisgarh: ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో మూడు ప్రధాన రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కేవలం కాంగ్రెస్ తెలంగాణతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్‌కి భిన్నంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 90 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 54 స్థానాలను గెలుచుకుంది, కాంగ్రెస్ అధికారం కోల్పోయి 35 స్థానాల్లో మాత్రమే గెలిచింది.

Read Also: CM Shivraj Singh Chouhan: మహిళల కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్న సీఎం.. వీడియో వైరల్..

అయితే ఛత్తీస్‌గఢ్ విజయంతో బీజేపీ కార్యకర్తలు జోష్‌లో ఉన్నప్పటికీ, ఒక అభిమానికి మాత్రం తీవ్ర అవమానం ఎదురైంది. రాష్ట్రంలోని మహాసముంద్ జిల్లాలోని కల్లారీ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అల్కా చంద్రకర్ గెలుపుపై తన స్నేహితులతో పందెం కాశారు. ఒక వేళ అల్కాచంద్రకర్ ఓడిపోతే తాను సంగం గుండు కొట్టించుకుని, సగం మీసం కొరిగించుకుంటానని ఎలక్ట్రీషియన్ దేర్హా రామ్ యాదవ్ పందెం కాశాడు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో చంద్రాకర్, కాంగ్రెస్ అభ్యర్థి ద్వారికాధీష్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. చివరకు ఆయన మాటలు నిజం కావడంతో స్థానిక బార్బర్ షాప్‌కి వెళ్లి సగం గుండు కొట్టించుకుని, సగం మీసాలను గీసుకున్నారు.

Exit mobile version