జార్ఖండ్‌లో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పేలుడు పదార్థాలతో రైల్వే ట్రాక్‌ను పేల్చేశారు. దీంతో 39 మీటర్ల మేర రైల్వేట్రాక్ ఎగిరిపడ్డాది. ఇక పేలుడు ధాటికి రైల్వే ట్రాక్ కింద మూడు అడుగుల గొయ్యిలు ఏర్పడ్డాయి. సాహిబ్‌గంజ్ జిల్లా రంగాగుట్ట గ్రామం దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Israel: ఇరాన్ చమురు, అణు కేంద్రాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు ఫ్లాన్.. యూఎస్ మీడియాలో కథనాలు
ఇటీవలే రైల్వేట్రాక్‌లే లక్ష్యంగా కొందరు దుండగులు రెచ్చిపోతున్నారు. ఈ మధ్య యూపీలో కూడా రైల్వేట్రాక్‌లపై గ్యాస్ సిలిండర్లు, ఇనుప రాడ్లు పెట్టి ప్రమాదాలు సృష్టించేందుకు ప్రణాళికలు రచించారు. అయితే రైల్వే అధికారుల అప్రమత్తతతో ప్రమాదాలు తప్పాయి. అయినా కూడా ఇలాంటి దుశ్చర్యలు ఆగడం లేదు. జార్ఖండ్‌లో బొగ్గు రవాణాకు వినియోగించే రైల్వే ట్రాక్‌లో కొంత భాగాన్ని పేల్చివేశారు. దీని వెనక క్రిమినల్ ముఠాల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటనాస్థలిని పరిశీలించారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Jani Master Case: జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్