Site icon NTV Telugu

Parliament’s Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఫిబవరి 1న మధ్యంతర బడ్జెట్.!

Parliament's Budget Session

Parliament's Budget Session

Parliament’s Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు వేళైంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించిన తర్వాత సెషన్ ప్రారంభమవుతుంది.

Read Also: Manipur: మణిపూర్‌లో కిడ్నాప్‌కి గురైన నలుగురిని హత్య చేసిన మిలిటెంట్లు..

ఎన్నికల ముందు ఫిబ్రవరి 1న ప్రభుత్వం ఓట్-ఆన్-అకౌంట్ లేదా ‘మధ్యంతర బడ్జెట్’ను సమర్పించనుంది. కొత్త ప్రభుత్వం తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 17వ లోక్‌సభ పదవీకాలం జూన్ 16తో ముగుస్తుంది. కాబట్టి సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇది పార్లమెంట్ చివరి సెషన్‌‌గా నిర్ణయించబడుతుంది. 2019లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న ప్రకటించబడింది, ఏప్రిల్ 11 నుంచి మే 19 మధ్య ఏడుదశల్లో ఓటింగ్ జరిగింది.

Exit mobile version