Site icon NTV Telugu

Jagdeep Dhankhar: సుప్రీంకోర్టుపై మరోసారి ఉప రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు

Jagdeepdhankhar

Jagdeepdhankhar

దేశ సర్వోన్నత న్యాయస్థానంపై ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు కంటే పార్లమెంటే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదయం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు న్యాయస్థానంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ పరమైన అంశాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్ అని పేర్కొన్నారు. పార్లమెంట్ కంటే అత్యుత్తమమైంది ఉందని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. పార్లమెంటే అన్నింటికీ సుప్రీం అని తేల్చి చెప్పారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: YS Jagan: పీఏసీ సమావేశంలో జగన్‌ హాట్‌ కామెంట్లు.. అంచనాలు పెంచి దోచేస్తున్నారు..!

ఇటీవల బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వివాదంగా మారింది. నిర్ణీత గడువులోగా రాష్ట్రపతి సమ్మతి తెలపాలని తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా వక్ఫ్ చట్టం తదుపరి విచారణ వరకు వాయిదా వేసింది. ఈ నిర్ణయాలే అధికార పెద్దలకు కోపం పుట్టించింది. ఉప రాష్ట్రపతి దగ్గర నుంచి బీజేపీ నేతలంతా సుప్రీం ధర్మాసనంపై విరుచుకుపడుతున్నారు. సుప్రీంకోర్టే ఆదేశాలు ఇస్తే.. ఇక పార్లమెంట్‌ మూసేసుకోవడం బెటర్ అంటూ ధ్వజమెత్తారు. ఇక బీజేపీ నేతల వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. సుప్రీంకోర్టును బీజేపీ నేతలు బెదిరిస్తున్నారంటూ ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Priyadarshi: నా జాతకం చూపిస్తే నటుడే అవ్వలేవన్నారు.. ఫోటో దిగితే చాలనుకున్న ఆయనే డైరెక్ట్ చేశారు !

Exit mobile version