Site icon NTV Telugu

Lovers Statue Marriage: బొమ్మలకు పెళ్లి.. నేటి తరం లైలా-మజ్నుల కథ

Lovers Statue Marriage

Lovers Statue Marriage

Parents Performed Statue Wedding Of Lovers Who Died Six Months Back: అమర ప్రేమికులైన లైలా-మజ్నుల కథ అందరికీ తెలిసిందే. గాఢంగా ప్రేమించుకున్న ఆ ఇద్దరు.. ఒక్కటి కాకుండానే చనిపోయారు. చనిపోయిన తర్వాత తమ ప్రేమను గెలిపించుకున్నారు. అందుకే, నేటికీ వారి ప్రేమ గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అలాంటి కథే మరొకటి చోటు చేసుకుంది. బ్రతికున్నంతకాలం తమ ప్రేమని గెలిపించుకోలేకపోయిన ఓ జంట, చనిపోయిన తర్వాత తమ కోరికని కుటుంబ సభ్యులతో నేర్చుకోగలిగారు. గుజరాత్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. తాపిలో నివశించే గణేష్‌, రంజనా గాఢంగా ప్రేమించుకున్నారు. రంజనాకు గణేష్ దూరపు బంధువు. ఆ బంధుత్వంతోనే ఏర్పడిన వీరి పరిచయం.. ప్రేమకు దారి తీసింది. ఒకరంటే ఒకరికి చచ్చేంత ఇష్టం ఏర్పడింది. పెళ్లి చేసుకొని ఒక్కటవ్వాలనుకున్నారు. ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.

Vladimir Putin: సందేహమే లేదు.. ఉక్రెయిన్‌పై గెలిచి తీరుతామన్న పుతిన్

ఈ విషయాన్ని తమ కుటుంబసభ్యులకు తెలియజేశారు. అయితే.. పెద్దలు వారి ప్రేమని అంగీకరించలేదు. గణేష్ దూరపు బంధువే కావడంతో.. పెళ్లికి నిరాకరించారు. దీంతో వాళ్లు చాలా బాధపడ్డారు. తమ ప్రేమని అంగీకరించాలని, ఒకరిని వదిలి మరొకరు ఉండలేమని పెద్దలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లు వినిపించుకోలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోవడంతో.. ఇక తాము ఎప్పటికీ కలవలేమని, తమ కోరిక నెరవేరే అవకాశం లేదని నిర్ణయించుకున్నారు. దాంతో.. ఆత్మహత్య చేసుకోవాలని ఫిక్సయి, ఆగస్టు 2022లో ఉరివేసుకొని ఆత్మహత్యచేసుకున్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు పశ్చాత్తాపం చెందారు. తమ పిల్లల ప్రేమను నిరాకరించి చాలా పెద్ద తప్పు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ వారి పెళ్లికి ఒప్పుకొని ఉండుంటే.. కనీసం తమ ముందైనా ఉండేవాళ్లని, కానీ తాము తీసుకున్న కఠిన నిర్ణయం వల్ల తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని కన్నీటిపర్యంతమయ్యారు.

Girls In Burqa: బురఖా ధరించి వచ్చిన విద్యార్థినులకు నో ఎంట్రీ.. కాలేజీలో ఉద్రిక్తత

ఈ నేపథ్యంలోనే కుటుంబ పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నారు. బతికుండగా వారి కల నెరవేర్చలేకపోయాం కాబట్టి, వారి విగ్రహాలను తయారు చేసి, వాటికి పెళ్లి చేయాలని అనుకున్నారు. అనుకున్నట్టుగానే విగ్రహాలు తయారు చేసి.. సరిగ్గా ఆ జంట చనిపోయిన ఆరు నెలలకు వారి విగ్రహాలకు ఘనంగా పెళ్లి జరిపించారు. ఈ వ్యవహారంపై అమ్మాయి తాత మాట్లాడుతూ.. గణేష్ దూరపు బంధువు కావడంతో వద్దునుకున్నామని చెప్పారు. ఐతే వారిద్దరూ ఒకరినొకరు ఎంతగానే ఇష్టపడ్డారని, అందుకే ఇరు కుటుంబాలు వారి విగ్రహాలకు పెళ్లి చేయాలనే ఆలోచనకు వచ్చి, ఇలా చేశామని చెప్పుకొచ్చారు.

Anchor Falls: యాంకర్‌పై పడిపోయిన ఫీల్డర్.. నవ్వులే నవ్వులు

Exit mobile version