కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్ ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్‌గాంధీ మేధావి అని.. యూపీఏ-2లో మన్మోహన్ సింగ్.. పదని పదవిని ఆఫర్ చేస్తే రాహుల్ గాంధీ కొన్ని సెకన్లలోనే తిరస్కరించారని గుర్తు చేశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదివిన మేధావి కాబట్టే ప్రధానమంత్రి కుర్చీని తిరస్కరించారన్నారు. 10,000 కిలోమీటర్లు నడిచి ప్రధానమంత్రి కుర్చీని తిరస్కరించడం మామూలు విషయం కాదన్నారు. రాహుల్ గాంధీ న్యాయ సూత్రాన్ని నమ్ముతారని చెప్పారు.
ఇది కూడా చదవండి: Gita Gopinath: గీతా గోపీనాథ్ సంచలన నిర్ణయం.. ఐఎంఎఫ్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి
ఇక మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మోడీ బలహీనమైన ప్రధాని అన్నారు. మోడీకి 56 అంగుళాల ఛాతీ కాదని.. 5 అంగుళాల ఛాతీనే ఉందని ప్రజలకు తెలుసన్నారు. ప్రపంచం మనల్ని ఎగతాళి చేస్తోందని.. ఇంత బలహీనమైన ప్రధానమంత్రిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. రాజ్యాంగ మరియు ప్రజాస్వామ్య హక్కులు హరించబడుతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాలు లేవనెత్తే ఆందోళనలను పరిష్కరించకపోతే సభ పనిచేయదని హెచ్చరించారు. బీహార్‌లో ఉద్దేశపూర్వకంగానే ఓట్లు తొలగిస్తున్నారని.. ఎన్నికల సంఘం అధికార పార్టీకి తొత్తుగా మారిందని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Jairam Ramesh: ఏదో బలమైన కారణమే ఉంది.. ధన్‌ఖర్ రాజీనామాపై జైరాం రమేష్ వ్యాఖ్య
పప్పు యాదవ్ ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని పూర్ణియా నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా గెలిచారు. కాంగ్రెస్ టికెట్ నిరాకరించింది. ఆ స్థానాన్ని కూటమి భాగస్వామి ఆర్జేడీకి ఇచ్చింది. దీంతో పప్పు యాదవ్ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి విజయం సాధించారు.
