NTV Telugu Site icon

Chandigarh: పంజాబ్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థులపై లాఠీఛార్జ్

Panjabuniversity

Panjabuniversity

పంజాబ్ యూనివర్సిటీలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పాల్గొన్న కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్యాంపస్‌లో ‘పంజాబ్ విజన్ 2047’ కాన్‌క్లేవ్‌ కార్యక్రమం జరుగుతోంది. సీఎం భగవంత్ మాన్ ప్రసంగిస్తుండగా పెద్ద ఎత్తున విద్యార్థులు చేరుకుని ఆందోళణ చేపట్టారు. పీయూ సెనేట్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థులపై ఒక్కసారిగా చండీగఢ్ పోలీసులు విరుచుకుపడ్డారు. విద్యార్థి, విద్యార్థినులపై లాఠీఛార్జ్ చేశారు.

ఇది కూడా చదవండి: Chandigarh: పంజాబ్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థులపై లాఠీఛార్జ్

యూనివర్శిటీ లా ఆడిటోరియంలో ఆప్ ఎంపీ విక్రమ్ సాహ్నీ నిర్వహించిన విజన్ పంజాబ్ 2047 కార్యక్రమానికి సీఎం భగవంత్ మాన్, పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, వీసీ రేణు విజ్, తదితరులు పాల్గొన్నారు. క్యాంపస్‌లో పంజాబ్ సీఎం మన్ ప్రసంగిస్తుండగా సెనేట్ ఎన్నికలు నిర్వహించాలంటూ విద్యార్థులు నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం విద్యార్థులపై లాఠీ జుళిపించారు. విద్యార్థులకు రక్తస్రావం జరిగింది. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇది కూడా చదవండి: Retiring Room In Railways: రైల్వే స్టేషన్‌లోని రిటైరింగ్ రూమ్‌లు ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?

సెనేట్ ఎన్నికలు ఆలస్యం కావడాన్ని నిరసిస్తూ విద్యార్థులు శాంతియుత నిరసన చేపట్టారు. ‘పంజాబ్ యూనివర్శిటీ బచావో మోర్చా’ బ్యానర్‌తో విద్యార్థులు తరలివచ్చారు. క్యాంపస్‌లో మార్చ్‌ను నిర్వహించారు. ముఖ్యమంత్రి మాన్ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా ఆడిటోరియం సమీపంలోకి చేరుకున్నారు. పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఆడిటోరియం దగ్గరకు వచ్చేందుకు స్టూడెంట్స్ అనుమతి తీసుకోలేదని.. ఆడిటోరియం చుట్టూ బారికేడ్లు వేయకపోవడం వల్ల విద్యార్థులను లోపలికి వెళ్లకుండా ఆపవలిసి వచ్చిందని పోలీస్ అధికారి తెలిపారు. ఈ ఘటన అనంతరం భారతీయ కిసాన్ యూనియన్ (క్రాంతికారి) సభ్యులు… ఆందోళనకారులతో కలిసి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. నిరసనకారులను అదుపులోకి తీసుకోలేదు.

 

Show comments