NTV Telugu Site icon

Same Gender Marriage: గే కమ్యూనిటీ సమస్యలపై కమిటీ ఏర్పాటు.. సుప్రీంకు తెలియజేసిన కేంద్రం

Same Gender Marriage

Same Gender Marriage

Same Gender Marriage: సెమ్ సెక్స్ మ్యారేజ్ అంశాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తోంది. సేమ్ సెక్స్ మ్యారేజ్ అంశంపై కేంద్రం, సుప్రీంకోర్టు మధ్య వాడీవేడీ వాదనలు జరుగున్నాయి. స్వలింగ వివాహాల విషయంలో ఆ జంటలు తమ హక్కులను కోల్పోతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే LGBTQIA+ కమ్యూనిటీ ఆందోళనల్ని పరిశీలించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు ఈ రోజు తెలిపింది. ఈ రోజు విచారణలో కేంద్రం తరుపున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా..కేంద్రం ఏర్పాటు చేయబోయే కమిటీకి కేబినెట్‌ సెక్రటరీ నేతృత్వం వహిస్తారని తెలిపారు.

Read Also: KTR Warangal Tour: కేటీఆర్‌ వరంగల్‌ పర్యటన.. క్లారిటీ ఇచ్చిన చీఫ్ విప్ వినయ్ భాస్కర్

స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. ఈ అంశంపై గత కొన్ని రోజులుగా సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ కేసులో కొన్ని రోజుల క్రితం కేంద్రానికి సుప్రీంకోర్టు పలు కీలక సూచనలు చేసింది. స్వలింగ జంటల ప్రాథమిక, సామాజిక హక్కులను కల్పించే విషయంలో ప్రభుత్వం ఏదో ఒక మార్గాన్ని కనుక్కోవాలని కోరింది. గే జంటలకు ఉమ్మడి బ్యాంక్ అకౌంట్స్ కల్పించడం, బీమా పాలసీల్లో భాగస్వామిని నామినేట్ చేసే అంశాలపై కేంద్ర స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలపింది. దీంతో పాటు స్వలింగ వివాహాల చట్టబద్ధతపై పార్లమెంట్ లో చర్చ జరగడం కీలకం అని గతంలో సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే సేమ్ సెక్స్ వివామాల్లో చట్టబద్ధత కల్పించకుండా వాళ్ల సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని ఏప్రిల్ 27న విచారణలో ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను మే 3కు వాయిదా వేసింది.

వివాహాల చట్టబద్ధత అనే అంశం పార్లమెంట్ పరిధిలోకి వస్తుందని, దీనిపై కోర్టులు కలుగచేసుకోవద్దని కేంద్రం గతంలో వ్యాఖ్యానించింది. కొన్ని పట్టణ సంపన్నవర్గాల్లో మాత్రమే ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్ కనిపిస్తోందని, ఇది భారతీయ సమాజానికి విరుద్ధం అని కేంద్రం పేర్కొంది. ఈ విషయంలో విస్తృత ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రం వెల్లడించింది. ఈ కేసును సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ ఎస్ కె కౌల్, జస్టిస్ ఎస్ ఆర్ భట్, జస్టిస్ హిమా కోహ్లీ మరియు జస్టిస్ పిఎస్ నరసింహాలతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది.