NTV Telugu Site icon

Wrestlers Protest: తాకితే అపార్థం చేసుకుంటారా.. రుజువులున్నాయా?

Wrestlers Protest

Wrestlers Protest

Panel Asked For Audio Video Proof Says Wreslters: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. రెజ్లర్లు కొన్ని రోజుల నుంచి దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన చేస్తున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే.. ఈ ఆరోపణలపై విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అయితే.. ఆ కమిటీ సభ్యులు రెజ్లర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని సమాచారం. రెజ్లర్లను లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియో లేదా ఆడియో రుజువులను ఆ కమిటీ సభ్యులు అడిగారట.

Singer Haesoo: ప్రముఖ సింగర్ ఆత్మహత్య.. ఆరోజు ఏం జరిగిందంటే?

కమిటిలోని ఒక మెంబర్‌.. తండ్రిలాంటి బ్రిజ్‌ భూషణ్‌ ఏదో తెలియక చనువుగా తాకితే, దాన్నికూడా అపార్థం చేసుకుంటారా? అని తనకు చెప్పినట్లు ఓ మహిళా రెజ్లర్‌ తెలిపింది. అలాగే.. డబ్ల్యూఎఫ్‌ఐ సిబ్బంది, కోచ్‌, బ్రిజ్‌ భూషణ్‌ సన్నిహితులందరూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భవనం వెయిటింగ్ ఏరియాలో కిక్కిరిసి ఉన్నారని.. ఇది భయపెట్టేదిగా ఉందని మరో రెజ్లర్ పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే వీళ్లు వచ్చినట్లు ఆ రెజ్లర్ అభిప్రాయపడ్డారు. తమ నుంచి స్టేట్‌మెంట్లు తీసుకునే సమయంలో పర్యవేక్షణ కమిటీలో కేవలం మహిళా సభ్యులు మాత్రమే గదిలో ఉండాలని తాము చేసిన అభ్యర్థనను సైతం కమిటీ సభ్యులు తిరస్కరించినట్టు మరో రెజ్లర్ తెలిపారు.

ICC New Rules: ఆ మూడు రూల్స్‌ని సవరించిన ఐసీసీ.. అవేంటంటే?

కాగా.. మే 7వ తేదీన ఇద్దరు రెజ్లర్లు బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో బ్రిజ్‌భూషణ్ తమ పట్ల పాల్పడ్డ లైంగిక వేధింపుల గురించి వివరించారు. బ్రీతింగ్ టెస్ట్ సాకుతో ఆయన తమ రొమ్ము, నడుము భాగాల్లో చేతులు తాకాడని.. ట్రైనింగ్ సెషన్‌లో జెర్సీని పైకి లేపాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు.. విచారణలో భాగంగా తాము సాక్ష్యాలు సమర్పిస్తున్నప్పుడు, కమిటీ సభ్యులు వీడియో రికార్డ్‌ని స్విచ్చాఫ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని రెజ్లర్లు తమ ఫిర్యాదులో వెల్లడించారు. కాగా.. మాజీ బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ మేరీ కోమ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీని యూనియన్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే!