NTV Telugu Site icon

Chhattisgarh: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అపశృతి.. పావురాన్ని పైకి ఎగరేస్తే కిందపడ్డ కపోతం.. చర్యలకు ఆదేశం

Independence Day Pigeon Rel

Independence Day Pigeon Rel

ఆగస్టు 15న జరిగిన ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ముంగేలిలో జరిగిన వేడుకల్లో జిల్లా ఎస్పీ గిరిజా శంకర్ జైస్వాల్ పావురాన్ని పైకి విసిరారు. కానీ అది పైకి వెళ్లకుండా కిందపడిపోయింది. దీంతో ఎస్పీ సహా వేదికపై ఉన్న వారంతా అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అంత పెద్ద కార్యక్రమాలు ఇలాంటి పనులేంటి? అని నిలదీస్తున్నారు.

ఇది కూడా చదవండి: Manda Krishna Madiga: నేను ఏ పార్టీలో చేరను.. అది ఎప్పుడు ఉండే ప్రచారమే..

ముంగేలిలో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాన్ని స్థానిక పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పున్నూలాల్ మోహ్లే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ముంగేలి కలెక్టర్ రాహుల్ డియో, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గిరిజా శంకర్ జైస్వాల్ పాల్గొన్నారు. ముగ్గురు అతిథులు పావురాలు పైకి విసిరేందుకు నిర్వాహకులు అందజేశారు. ఎమ్మెల్యే, కలెక్టరు విడుదల చేసిన పావురాలు ఆకాశంలోకి ఎగిరిపోగా.. జిల్లా ఎస్పీ ఎగురవేసిన పావురం మాత్రం కిందపడిపోయింది. దీంతో నిర్వాహకులు మరొక పావురాన్ని జిల్లా ఎస్పీకి అందజేయగా అది పైకి వెళ్లిపోయింది. అయితే ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎస్పీ ఎగరేసిన పావురం అనారోగ్యంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకే కిందపడిపోయినట్లుగా సమాచారం. అయితే ఈ ఘటనపై గిరిజా శంకర్ జైస్వాల్ సీరియస్ అయ్యారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు లేఖ రాసినట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి.