Site icon NTV Telugu

Pan-Aadhar Linkage: పాన్-ఆధార్ లింక్ చేసుకున్నారా? తుది గడువు ఇదే..!!

Pan Aadhar Linkage

Pan Aadhar Linkage

Pan-Aadhar Linkage: మీ పాన్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేశారా ? చేయకపోతే త్వరగా చేసుకోండి. లేకపోతే మీ పాన్ కార్డు పనిచేయదు. ఇప్పటివరకు పాన్‌తో ఆధార్ అనుసంధానం చేసుకోనివారు వెంటనే చేసుకోవాలని పన్నుచెల్లింపుదారులను ఆదాయపు పన్నుశాఖ కోరింది. పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నోమార్లు గడువు పొడిగించింది. తాజాగా పాన్, ఆధార్ లింకేజీ ప్రక్రియకు 2023 మార్చి 31వ తేదీని తుదిగడువుగా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 31లోగా ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయకుంటే పాన్ కార్డు నిరుపయోగంగా మారుతుందని కేంద్రం స్పష్టం చేసింది.

Read Also: Puri Jagannadh: పూరి జగన్నాథ్ జీవితంలో సగం రోజులు గొడవలేనట

ఐటీ చట్టం-1961 ప్రకారం మినహాయింపు పరిధిలోకి రాని వారు తప్పనిసరిగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే సాధారణ గడువు ముగిసిందని.. తాజాగా గడువు పొడిగించిన నేపథ్యంలో ఆలస్య రుసుం కింద రూ.1000 చెల్లించి పాన్‌తో ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుందని ఐటీ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ప్రకటన చేసింది. ఒకవేళ మీరు ఆధార్‌తో అనుసంధానం చేయకుంటే పాన్ కార్డు పనిచేయదు. అప్పుడు బ్యాంకుల్లో ఖాతాలు లేదా డీమ్యాట్ అకౌంట్ తెరిచేందుకు సాధ్యం కాదు. అందువల్ల ఇప్పటికైనా ఈ ప్రక్రియపై దృష్టి సారించాలని ఐటీ శాఖ కోరింది.

Exit mobile version