Site icon NTV Telugu

PAN-Aadhaar Linking : పాన్ కార్డ్ తో ఆధార్ లింక్ చేశారా.. వచ్చే నెలే లాస్ట్…

Untitled Design (18)

Untitled Design (18)

పాన్ కార్డ్ ను ఆధార్ తో లింకింగ్ చేశారా.. లేకపోతే ఇప్పుడే లింకింగ్ చేసుకోండి.. పాన్ కార్డ్ తో ఆధార్ లింక్ చేసేందుకు.. డిసెంబర్ 31 చివరి తేది కావడంతో అందరూ తప్పని సరిగా పాన్ కార్డ్ తో ఆధార్ లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. ఒక వేళ మీరు కనుక డిసెంబర్ 31 వరకు లింక్ చేయించక పోయినట్లయితే.. మీ పాన్ జనవరి 1, 2026 నుండి ఇన్‌యాక్టివ్‌ అవుతుంది.

Read Also: Uttar Pradesh:ప్రసవ వేదనతో భార్య మృతి.. కొన్ని గంటల్లోనే కుప్పకూలిన భర్త

పూర్తి వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 31వ తేదీలోపు మీ పాన్ కార్డ్ ను ఆధార్ తో లింక్ చేయకపోతే.. జనవరి 1, 2026 నుండి ఇన్‌యాక్టివ్‌ అవుతుంది. పాన్ ను ఆధార్ తో లింక్ చేయడం వల్ల ITR దాఖలు, SIPలు, పన్ను వాపసులపై ప్రభావం చూపుతుంది. ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లో సులభంగా లింక్ చేయవచ్చు. సమస్యలు నివారించడానికి త్వరగా పూర్తి చేయండి.

Read Also:Misbehave: దేశ అధ్యక్షురాలిపై చేయి వేసి.. ముద్దు పెట్టబోయిన ఓ వ్యక్తి.. అడ్డుకున్న సిబ్బంది

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతి ఒక్కరూ తమ పాన్ కార్డు, ఆధార్ కార్డును లింక్ చేయడం తప్పనిసరి చేసింది. మీ పాన్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ చేయకపోతే మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.. టాక్స్-ఫైలింగ్ వెబ్‌సైట్ అయిన టాక్స్‌బడ్డీ ప్రకారం.. మీ పాన్ కార్డ్ నిష్క్రియంగా మారితే మీరు మీ ఐటీఆర్‌ను ఫైల్ చేయలేరు. SIPలు చేయడంలో కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. ఆధార్, పాన్ కార్డును ఒకదానితో ఒకటి ఎలా లింక్ చేయాలో చాలా మంది ఆలోచిస్తున్నారు. అయితే ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ఈ ఎంపిక అందుబాటులోకి వచ్చింది. మీరు చాలా సులభంగా మీ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయవచ్చు. ఆధార్ కార్డ్-పాన్ కార్డ్ ఒకదానికొకటి లింక్ చేయకపోతే మీరు ITR దాఖలు చేయలేరు, పన్ను వాపసు పొందలేరు, ఫారమ్ 26AS, TDS/TCS సమాచారం కనిపించవు. పాన్-ఆధార్ లింక్ చేసిన తర్వాత ఈ సౌకర్యాలన్నీ తిరిగి పొందవచ్చు.

Exit mobile version