Pakistani Couple: పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిన ఒక ప్రేమ జంట, భారత సరిహద్దు దాటి బీఎస్ఎఫ్‌కు పట్టుబడింది. పాకిస్తానీ వ్యక్తి, అతడి ప్రేమికురాలు ఇంటి నుంచి పారిపోయి కాలినడకన గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి వచ్చారు. వీరిద్దరిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.
Read Also: Visakhapatnam: విశాఖపట్టణం గూఢచర్య కేసులో ఇద్దరు నిందితులకు శిక్షలు.. NIA ప్రత్యేక కోర్టు తీర్పు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం అంతర్జాతీయ సరిహద్దు దాటిని పోపాట్(24), గౌరీ(20)లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు ఆదివారం రాత్రి పాకిస్తాన్‌లోని అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామం నుంచి పారిపోయారు. ఇద్దరు భారత్ వైపు ప్రయాణించి పట్టుబడ్డారని బాలాసర్ పోలీసులు తెలిపారు. పెట్రోలింగ్ చేస్తున్న బీఎస్ఎఫ్ సిబ్బంది జంటను అదుపులోకి తీసుకున్నట్లు వారు చెప్పారు.
తమ కుటుంబాలు పెళ్లికి నిరాకరించడంతో తాము పారిపోయి వచ్చినట్లు జంట తెలిపింది. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. గత రెండు నెలల్లో ఇది రెండో సంఘటన. అంతకుముందు అక్టోబర్ 8న సరిహద్దులో ఇద్దరు వ్యక్తులను ఇదే విధంగా అదుపులోకి తీసుకున్నారు.
