Pakistan YouTube Ban: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కు చెందిన యూట్యూబ్ ఛానెల్స్, సెలెబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు అన్నింటినీ భారత దేశంలో బ్యాన్ చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో పాక్‌కు చెందిన పలు న్యూస్ ఛానెల్స్‌ను కూడా భారత్ లో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇవాళ (జూలై 2న) ఈ ఛానెల్స్ అన్నీ భారత్‌లో ఆన్‌లైన్‌లోకి వచ్చేశాయి.
Read Also: Delhi: రూ. 84 లక్షల మెర్సిడెస్-బెంజ్‌ను.. రూ.2.5 లక్షలకే అమ్మిన ఓనర్.. కారణం ఇదే..?
కాగా, సాబా కమర్, అహద్ రజా మిర్, హనియా మిర్ లాంటి పాక్ సెలెబ్రిటీల ఇన్‌స్టాగ్రాం అకౌంట్స్ కూడా భారత్‌లో అన్‌బ్లాక్ అయిపోయాయి. పలు పాక్ న్యూస్ ఛానెల్స్ కూడా యూట్యూబ్‌లో కనిపిస్తున్నాయి. దీంతో పాక్ ఛానెల్స్, సెలెబ్రిటీలపై భారత్‌లో బ్యాన్ తొలగించారా? అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక, భారత ప్రభుత్వం నుంచి ఈ విషయంలో ఎలాంటి ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. కానీ, ఈ ఛానెల్స్, సోషల్ మీడియా అకౌంట్స్ ఆన్‌లైన్‌లో దర్శనం ఇస్తుండటంతో దీనిపై కేంద్ర సర్కార్ ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది.
