Site icon NTV Telugu

Shivraj Singh Chouhan: ఈసారి అలా చేస్తే పాక్ ప్రపంచ పటంలో ఉండదు

Shivrajsinghchouhan

Shivrajsinghchouhan

దాయాది దేశం పాకిస్థాన్‌ను కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్ తీవ్రంగా హెచ్చరించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ మరోసారి ఉల్లంఘిస్తే ప్రపంచ పటంలో తన ఉనికిని కోల్పోతుందని వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయినా కూడా పాక్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి వార్నింగ్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Sophia Qureshi: కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు

ఉగ్రవాదుల్ని అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని తెలిపారు. దాయాది దేశ కుట్రలను భారత సైన్యం సులువుగా తిప్పికొట్టిందని వెల్లడించారు. దేశంలో తరచూ ఎన్నికలు నిర్వహించడంతో ప్రభుత్వాలపై ఖర్చుల భారం పడుతుందన్నారు. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్‌ ప్రజలు ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’కు మద్దుతు తెలపాలని శివరాజ్‌సింగ్‌ కోరారు.

ఇది కూడా చదవండి: Ram Charan: లండన్‌లో రామ్‌చరణ్‌ను కలిసిన కామన్‌వెల్త్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌..

Exit mobile version