Site icon NTV Telugu

Pak-India: ఎల్‌ఓసీ దగ్గర మళ్లీ పాక్ సైన్యం కవ్వింపు.. కాల్పులను తిప్పికొట్టిన ఆర్మీ

Loc

Loc

పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ మరింత కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. వరుసగా నాలుగో రోజు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. భారత సైన్యం అప్రమత్తమై.. సమర్థవంతంగా కాల్పులను తిప్పికొట్టాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు అయినట్లు సమాచారం అందలేదు.

ఏప్రిల్ 27-28 అర్ధరాత్రి సమయంలో కుప్వారా, పూంచ్ జిల్లాలకు ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ ఆర్మీ పోస్టులు కాల్పులు జరిపాయని భారత్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. అంతే వేగంగా.. సమర్థవంతంగా కాల్పులను తిప్పికొట్టినట్లు పేర్కొంది.

ఇది కూడా చదవండి: Jammu Kashmir: కాశ్మీర్ టూరిజానికి ఆశ.. పహల్గామ్ వస్తున్న టూరిస్టులు..

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్‌తో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. అంతేకాకుండా పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు మూసివేసింది. ఇలా ఒక్కొక్కటిగా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక ఉగ్ర దాడులకు పాల్పడ్డ నిందితుల సమాచారం అందిస్తే రూ.20లక్షల రివార్డ్ ప్రకటించింది. గత మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్ది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారు ఉండడం బాధాకరం.

ఇది కూడా చదవండి: Pakistan: రష్యా, చైనా శరణు కోరుతున్న పాకిస్తాన్..

Exit mobile version