పాకిస్థాన్ తీరును అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు భారతదేశానికి చెందిన ఏడు దౌత్య బృందాలు ఆయా దేశాల్లో పర్యటిస్తున్నాయి. దాయాది దేశం యొక్క ఉగ్రవాద వైఖరిని ప్రపంచ నేతలకు వివరిస్తున్నాయి. అయితే జేడీయూ ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలోని ప్రతినిధి బృందం.. అపరాజిత సారంగి, బ్రిజ్‌లాల్, ప్రధాన్ బారువా, హేమంగ్ జోషి, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, సీపీఐ నేత జాన్ బ్రిట్టాస్, మాజీ రాయబారి మోహన్ కుమార్ మలేషయాలో పర్యటించడానికి సిద్ధపడుతుండగా పాకిస్థాన్ అడ్డుకునే ప్రయత్నం చేసింది.
ఇది కూడా చదవండి: Virat Kohli: ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉండాలనుకోను.. ఇక ఎక్కువ రోజులు ఆడలేను!
‘‘మనది ఇస్లామిక్ దేశం.. మీరు ఇస్లామిక్ దేశం… భారత ప్రతినిధి బృందం మాట వినకండి. మలేషియాలో వారి కార్యక్రమాలను రద్దు చేసుకోండి.’’ అని మలేషియాను పాకిస్తాన్ రాయబార కార్యాలయం కోరింది. కానీ అందుకు మలేషియా ప్రభుత్వం తిరస్కరించింది. పాకిస్థాన్ ప్రతిపాదనను తోసిపుచ్చింది. దీంతో దాయాది దేశానికి చెంపదెబ్బ కొట్టినట్లైంది. భారత దౌత్య బృందానికి పూర్తి మద్దతు లభించింది. అన్ని కార్యక్రమాలను భారత బృందం యథావిధిగా కొనసాగించింది.
ఇది కూడా చదవండి: CM Chandrababu : అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు…
ఈ బృందం అప్పటికే జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, ఇండోనేషియాలో పర్యటించింది. చివరి పర్యటన మలేషియానే. శనివారమే మలేషియా రాజధాని కౌలాలంపూర్ చేరుకుంది. ఇంతలోనే పాకిస్థాన్ కుట్ర పన్నింది. భారతదేశం పంపించిన ఉద్దేశాలను ఆయా దేశాధినేతలకు వివరించినట్లు దౌత్య బృందం తెలిపింది. ప్రపంచ దేశాలన్ని ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించాయని చెప్పుకొచ్చారు.
ఇక ఆయా దేశాలకు వెళ్లిన దౌత్య బృందాలతో తిరిగి వచ్చాక ప్రధాని మోడీ అఖిలపక్ష ప్రతినిధుల బృందాన్ని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం జూన్ 9 లేదా 10న జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం భారత్.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం.. పాకిస్థాన్ వైఖరిని ఎండగట్టేందుకు అన్ని పార్టీలతో కూడిన దౌత్య బృందాలను విదేశాలకు పంపించింది.
