NTV Telugu Site icon

Zakir Naik: ఇండియా మోస్ట్ వాంటెడ్ జకీర్ నాయక్‌కి పాకిస్తాన్ ఘన స్వాగతం..

Zakir Naik, Pakistan, India,

Zakir Naik, Pakistan, India,

Zakir Naik: తీవ్రవాద సంబంధిత ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఇస్లామిక్ మత ప్రచారకుడు జకీర్ నాయక్‌కి పాకిస్తాన్ ఘనంగా స్వాగతం పలికింది. ఇండియాకి మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న జకీర్ నాయక్ గత కొన్నేళ్లుగా మలేసియాలో ఆశ్రయం పొందుతున్నాడు. జకీర్ పాకిస్తాన్ వెళ్లిన సందర్భంలో ప్రధాని షెహజాబ్ షరీఫ్‌తో పాటు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఇతడి పర్యటన భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read Also: Smuggling : రూ. 43 లక్షల అల్పాజోలం, క్లోరోహైడ్రైడ్ పట్టివేత…

పాకిస్తాన్ రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఉన్నతాధికారులు జకీర్‌కి షేక్ హ్యాండ్స్ ఇస్తూ, కౌగిలించుకుంటూ సాదర స్వాగతం పలికారు. నెల రోజుల పాటు అతను పాకిస్తాన్ అంతటా పర్యటించబోతున్నారు. పరారీలో ఉన్న జకీర్ నాయక్ పర్యటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ఆజ్యం పోసే అవకాశం ఉంది. ద్వేషపూరిత ప్రసంగాల కారణంగా భారత్‌తో పాటు అనేక దేశాలు ఇతడిపై నిషేధాన్ని విధించాయి. భారత్‌తో పాటు బంగ్లాదేశ్, కెనడా, యూకేల్లో ఇతడిపై నిషేధం ఉంది. పాకిస్తాన్ చాలా సందర్భాల్లో భారత్ వ్యతిరేకులకు ఘన స్వాగతం పలికిన చరిత్ర కలిగి ఉంది. జూలై 2016లో ఇతను భారత్ నుంచి పారిపోయాడు.

Show comments