Terror Plot: ఢిల్లీ, పంజాబ్‌లో భారీ దాడులకు కుట్ర.. పాక్ పన్నాగం విఫలం..
- ఉగ్ర కుట్ర భగ్నం చేసిన యూపీ ఏసీఎస్..
- ఢిల్లీ, పంజాబ్‌లో ఉగ్రదాడికి కుట్ర..
- పాక్ గ్యాంగ్‌స్టర్ ఆదేశాలతో దాడులకు ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ, పంజాబ్ లలో భారీ దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్ర ముఠాను అధికారులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ షాజాద్ భట్టి ఆదేశాల మేరకు నలుగురు అనుమానితులు ఈ దాడులకు ప్లాన్ చేస్తేన్నట్లు వెల్లడైంది. పంజాబ్‌లోని రద్దీ ఉండే ఆస్పత్రులు, ఒక రాజకీయ పార్టీ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. పాకిస్తాన్లో ఉంటున్న భట్టికి, మరో గ్యాంగ్ స్టర్ అబిద్ జాట్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉంది. వీరిద్దరు కలిసి భారత్‌లో భారీ దాడులు చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ దాడులకు పాల్పడేందుకు షాజాద్ భట్టి భారత్‌లో మనుషులను నియమించుకున్నట్లు తేలింది.
అరెస్టయిన వారిలో మహ్కాబ్, గగన్‌దీప్ సింగ్ అలియాస్ గురి, షారుఖ్, ముషారఫ్ సహా నలుగురిని అరెస్ట్ చేశారు. వీరంతా దాడులు చేయాలని ప్లాన్ చేస్తున్న ప్రాంతాలను సందర్శించి రెక్కీ నిర్వహించారు. ఆ ప్రదేశాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు తీసి జీపీఎస్ లోకేషన్ ద్వారా వివరాలు నమోదు చేసుకున్నారు. వీటిని పాక్‌లో ఉంటున్న భట్టికి పంపారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలను సమకూర్చే బాధ్యత షారుఖ్, ముషారఫ్‌లకు ఇవ్వబడింది. వీరు ఆస్పత్రిని పేర్చేయడానికి, బాంబు దాడులు చేయడానికి సోషల్ మీడియాలో సెర్చ్ చేశారు. భట్టి తన నెట్వర్క్ ద్వారా పాకిస్తా నుంచి మొహ్కాబ్, గగన్‌దీప్‌లకు ఆయుధాలు పంపేవారు.
Also Read
- TMC: మమతా పార్టీకి వరుస దెబ్బలు.. టీఎంసీ కీలక నేత సంచలన నిర్ణయం
- Siddaramaiah: ప్రసక్తే లేదు.. అక్కడికి వెళ్లబోను.. తేల్చి చెప్పిన సిద్ధరామయ్య
- Japan-Mangoes: అన్నదాతలకు జపాన్ షాక్.. సీజన్లో భారత మామిడిపండ్లపై నిషేధం
- Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎగ్జిట్.. హైకమాండ్ ఫోర్స్ చేసిందా? ఆయనే లొంగిపోయారా?
ఢిల్లీ, పంజాబ్‌లోని రద్దీ ప్రాంతాలను వీరు టార్గెట్ చేశారు. ఇదే కాకుండా టార్గెటెడ్ మర్డర్స్, భారీ దాడులకు ప్రణాళిక రచిస్తున్నారు. యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ (ఏటీఎస్) ఈ నెట్‌వర్క్‌ను ఛేదించింది. ఇప్పటి వరకు ఈ కేసులో భట్టికి చెందిన నాలుగు వేర్వేరు ముఠాలను అరెస్ట్ చేశారు. 150 మందికి పైగా అనుమానితుల్ని విచారించి, 13 మందిని జైలుకు పంపారు.
తాజావార్తలు
-
Terror Plot: ఢిల్లీ, పంజాబ్‌లో భారీ దాడులకు కుట్ర.. పాక్ పన్నాగం విఫలం..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కోసం రూ.30 కోట్లు.. నేనంటే నేను అంటూ తీవ్ర పోటీ..
-
BrahMos Missile: భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో గ్రీస్ ఒప్పందం..! టర్కీలో భయాందోళనలు
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
Putin: కజకిస్థాన్‌లో పుతిన్ పర్యటన.. అణు విద్యుత్ శక్తిపై కీలక ఒప్పందం
ట్రెండింగ్
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!