NTV Telugu Site icon

Pakistan: పాక్‌లో భయపడిచస్తున్న టెర్రరిస్టులు అజ్ఞాతంలోకి.. ఈ ఏడాది 16 మంది ఖతం.. ‘రా’ పనిగా ఆరోపణ

Pakistan

Pakistan

Pakistan: ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్తాన్‌లో ఇప్పుడు భయపడి చస్తున్నారు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడి నుంచి వచ్చి చంపుతారో అని టెర్రరిస్టులు భయపడుతున్నారు. ఇటీవల జరగుతున్న హత్యలతో వారిలో భయాందోళనలు మొదలయ్యాయి. దీంతో ముఖ్యమైన ఉగ్రనేతలు అంతా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి 16 మంది ఉగ్ర నేతలను గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో పాకిస్తాన్ గడ్డపైనే హతమయ్యారు. రెండేళ్లలో 18 మంది టెర్రరిస్టులు హత్యకు గురయ్యారు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహీద్దీన్ వంటి ఉగ్రసంస్థలకు చెందిన ఉగ్రవాదులు చనిపోయిన వారిలో ఉన్నారు. ఈ వరస హత్యలపై ‘సండే గార్డియన్’ కథనాన్ని ప్రచురించింది.

అయితే, భారత ప్రభుత్వమే పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల్ని హతమారుస్తోందని దాయాది దేశం ఆరోపిస్తోంది. ఈ టార్గెటెడ్ కిల్లింగ్స్‌లో ‘RAW’ హస్తమున్నట్లు పాక్ అనుమానిస్తోంది. అయితే ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఈ ఆరోపణలకు విలువ లేకుండా పోయింది. ఇదిలా ఉంటే జూన్ నెలలో కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించాడు. దీని తర్వాత అమెరికా పౌరుడు, భారత్ ఉగ్రవాదిగా గుర్తించిన మరో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారతీయుడు కుట్ర పన్నాడని అమెరికా ఏజెన్సీలు అభియోగాలు నమోదు చేశాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ టార్గెటెడ్ కిల్లింగ్స్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Read Also: Kerala: మెట్రో స్టేషన్‌కి దారి చూపిస్తానని.. 52 ఏళ్ల మహిళపై వ్యక్తి అత్యాచారం..

ఇదిలా ఉంటే పాకిస్తాన్ వ్యాప్తంగా చనిపోతున్న ఉగ్రవాదులు, భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు, దాడులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారే. కరాచీ, సియాలో కోట్, నీలం వ్యాలీ, పీఓకే, ఖైబర్ ఫఖ్తంఖ్వా, రావల్ కోట్, రావల్పిండి, లాహోర్ ఇలా పాక్‌లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు హతమాయ్యారు. మోటార్ సైకిల్ పై ఇద్దరు వ్యక్తులు రావడం, వెంటనే ఉగ్రవాదిని కాల్చేసి అక్కడి నుంచి పరారవ్వడం జరుగుతోంది. ఇప్పటి వరకు జరిగిన టెర్రరిస్టుల హత్యలన్నీ ఇలానే జరిగాయి. అయితే ఈ కేసుల్లో ఇప్పటి వరకు పాక్ పోలీసులకు ఒక్క ఆధారం లభించలేదు.

దీని వెనక భారతదేశ ‘రా’ ఉందని, అయితే దీన్ని వారు ఎప్పటికీ ఒప్పుకోరని, మా మిత్రులు, సీనియర్ స్థాయిల్లో ఉన్న వ్యక్తులు చనిపోతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో మేం అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయామని, మా వాట్సాప్ గ్రూపులు, ప్రైవేట్ సంభాషనల్ని ‘రా’ ఎలా గుర్తించి, చంపుతోంది, వారు పాక్ నుంచే సాయం పొందుతున్నారా..? అని లష్కరే తోయిబా మాజీ ఉగ్రవాద సభ్యుడు వాపోతుండటం అకడి పరిస్థితిని చెబుతోంది.

2023లో పాక్‌లో హతమైన ఉగ్రవాదులు:

1) అద్నాన్ అహ్మద్ అకా హంజ్లా అహ్మద్, లష్కరే తాయిబా, డిసెంబర్, కరాచీ.
2) ఖ్వాజా షాహిద్, లష్కర్-ఇ-తయ్యబా, నవంబర్, నీలం లోయ, PoK.
3) అక్రమ్ ఘాజీ, లష్కా, నవంబర్, ఖైబర్ పఖ్తుంక్వా.
4) రహీం ఉల్లా తారీఖ్, జైష్-ఎ-మొహమ్మద్, నవంబర్, ఒరంగీ, కరాచీ.
5) దావూద్ మాలిక్, జైషే మౌలానా మసూద్ అజార్, ఉత్తర వజీరిస్థాన్‌కు సన్నిహితుడు.
6) షాహిద్ లతీఫ్, జైష్, అక్టోబర్, సియాల్కోట్.
7) మౌలానా రెహ్మాన్, లష్కర్, సెప్టెంబర్, కరాచీ.
8) ముఫ్తీ ఖైజర్, లష్కర్, సెప్టెంబర్, కరాచీ.
9) మొహమ్మద్ రియాజ్ @అబు ఖాసిమ్, సెప్టెంబర్, రావల్కోట్, PoK.
10) సర్దార్ హుస్సేన్ అరైన్, లష్కర్, కరాచీ.
11) పరమజిత్ పంజ్వార్, ఖలిస్తాన్ ఫోర్స్, మే, జోహార్ పట్టణం, లాహోర్.
12) ఖలీద్ బషీర్, లష్కర్, మే, లాహోర్.
13) సయ్యద్ నూర్ షాలోబర్ (లష్కర్ మరియు జైష్ రెండింటికీ పనిచేశారు), మార్చి, ఖైబర్ పఖ్తుంక్వా ప్రాంతం.
14) బషీర్ అహ్మద్ పీర్, @ఇంటియాజ్ ఆలం, హిజ్బుల్ ముజాహిదీన్, ఫిబ్రవరి, రావల్పిండి.
15) సయ్యద్ ఖలీద్ రాజా, అల్ బదర్, ఫిబ్రవరి, కరాచీ.
16) ఐజాజ్ అహ్మద్ అహంగర్ (కాశ్మీర్‌లో ISI యొక్క ఆపరేషన్‌తో సన్నిహితంగా పనిచేశాడు) ఫిబ్రవరి, ఆఫ్ఘనిస్తాన్ యొక్క కునార్ ప్రావిన్స్.