Site icon NTV Telugu

Asaduddin Owaisi: పాకిస్తాన్ ఒక విఫల దేశం..

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. శనివారం ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ ఒక విఫల దేశం’’ అని అభివర్ణించారు. అది ఎప్పుడూ భారత్‌ని శాంతియుతంగా జీవించనివ్వదు అని అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందున పాకిస్తాన్‌ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రే లిస్ట్‌లో ఉంచేలా ప్రయత్నాలు చేయాలని చెప్పారు.

Read Also: CRPF: పాక్ మహిళను పెళ్లి చేసుకున్న సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ డిస్మిస్..

‘‘భారతదేశం ఎల్లప్పుడూ బలంగా ఉంది. పాకిస్తాన్ దీనికి భిన్నంగా విఫలదేశంగా తయారైంది. పాకిస్తాన్ తన దేశంలో వివిధ జాతుల మధ్య శాంతిని నిర్ధారించలేకపోయింది. ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ వంటి ఇరుగు పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు కలిగి లేదు. మోడీ ప్రభుత్వం నౌకలు, విమానాలపై ఆంక్షలు విధించింది. కానీ బలమైన చర్య FATF గ్రే లిస్ట్’’ అని ఒవైసీ అన్నారు.

ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఒవైసీ స్పందించారు. ‘‘భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలు 1947లో జిన్నాను తిరస్కరించారని, అక్కడికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. వారి వారసులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భూమిని వదిలి వెళ్ళరని ఆయన (మునీర్) గుర్తుంచుకోవాలి’’ అని ఒవైసీ చెప్పారు. పాకిస్తాన్‌పై భారత్ దాడి చేస్తే, చైనాతో కలిసి బంగ్లాదేశ్ ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమిస్తుంనది బంగ్లా మాజీ ఆర్మీ అధికారి చేసిన వ్యాఖ్యల్ని కూడా ఒవైసీ తప్పుపట్టారు. ‘‘స్వతంత్ర దేశంగా బంగ్లాదేశ్ ఏర్పడటానికి సహకరించిన భారత్ దేశానికి మీరు రుణపడి ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’’ అని అన్నారు.

Exit mobile version