NTV Telugu Site icon

Captain Anshuman Singh: అమరుడి భార్యపై నీచమైన కామెంట్లు చేసింది పాకిస్తాన్ వ్యక్తి: ఎన్‌సీడబ్ల్యూ చీఫ్..

Captain Anshuman Singh's Widow

Captain Anshuman Singh's Widow

Captain Anshuman Singh: గతేడాది సియాచిన్ గ్లేసియర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి, అమరుడైన కెప్టెన్ అన్షుమాన్ సింగ్‌కి మరణానంతరం రెండో అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం కీర్తి చక్ర ప్రకటించింది. ఆయన భార్య స్మృతి సింగ్, తల్లి జూలై 5న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఈ అవార్డును స్వీకరించారు. పెళ్లైన నెలల వ్యవధిలోనే అన్షుమాన్ మరణించడం, తమ ప్రేమ, పెళ్లి గురించి ఎంతో బాధతో ఆమె మాట్లాడిన మాటలు అందర్ని కంటతడి పెట్టించాయి.

Read Also: Himanta Biswa Sarma: ‘‘ రైట్-వింగ్ నాయకులే లక్ష్యం’’.. ట్రంప్ హత్యాయత్నంపై అస్సాం సీఎం..

ఇదిలా ఉంటే స్మృతి సింగ్ అవార్డు తీసుకుంటున్న ఫోటోలు వైరల్ కావడంతో, ఓ యూజర్ ఆమెను అగౌరవపరుస్తూ నీజంగా వ్యాఖ్యలు చేశాడు. ఇది సోషల్ మీడియాలో ఆగ్రహానికి కారణమైంది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. దీనిపై ఢిల్లీ పోలీసులు తమ ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్ (IFSO) యూనిట్‌తో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యాఖ్యను పోస్ట్ చేసిన సోషల్ మీడియా ఖాతాకు సంబంధించిన వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. త్వరితగతిన విచారణ జరిపి మూడు రోజుల్లో తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఎన్‌సీడబ్ల్యూ కోరింది.

అయితే, అన్షుమాన్ సింగ్ భార్య స్మృతి సింగ్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పాకిస్తాన్‌కి చెందినవాడని జాతీయ మహిళా కమిషన్ (NCW) చైర్‌పర్సన్ రేఖా శర్మ పేర్కొన్నారు. ఇది అత్యంత దిగజారుడు వ్యాఖ్యలు అని, ఈ వ్యాఖ్యల్ని మేము సోషల్ మీడియాలో చూశామని, వెంటనే సుమోటోగా తీసుకున్నామని, సదరు వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. అయితే, ఆ వ్యక్తి పాకిస్తాన్‌కి చెందిన వ్యక్తి కావచ్చని అన్నారు.