Site icon NTV Telugu

Operation Sindoor: భారత్ చెప్పింది తక్కువే.. “సిందూర్‌”లో పాకిస్తాన్‌కి తీవ్ర నష్టం..

Op Sindoor

Op Sindoor

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ గురించి భారత సైన్యం చెప్పిన దాని కన్నా పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయినట్లు ఆ దేశ పత్రాలు బయటపెట్టాయి. భారత్ పేర్కొన్న దాని కన్నా అదనంగా మరో 8 ప్రాంతాల్లో దాడులు జరిగినట్లు చెప్పింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్, పీఓకే లోని 09 ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో లష్కరే, జైషే మహ్మద్‌కి చెందిన 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, ఈ దాడులకు ప్రతీకారంగా పాక్ సైన్యం డ్రోన్లతో భారత్‌పై దాడులకు తెగబడింది. దీని తర్వాత, భారత్ పాకిస్తాన్‌లోని పలు వైమానిక స్థావరాలపై దాడులు చేసింది.

Read Also: PM Modi: రేపు మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలి భేటీ

ఈ దాడుల గురించి భారత సైన్యం మీడియా బ్రీఫింగ్‌లో వెల్లడించింది. అయితే, భారత్ చెప్పిన దాడి కన్నా తమకు ఎక్కువ నష్టం వాటిల్లిందని పాకిస్తాన్ ‘‘ఆపరేషన్ బన్యన్ ఉన్ మర్సూస్’’ పత్రాల్లో వెల్లడించింది. భారత సైన్యం పేర్కొన్న దాని కన్నా మరో 8 లక్ష్యాలపై దాడులు జరిగినట్లు ఇందులో పేర్కొంది. పాకిస్తాన్ పత్రాల్లో పెషావర్, ఝాంగ్, సింధ్‌లోని హైదరాబాద్, పంజాబ్‌లోని గుజరాత్, గుజ్రాన్‌వాలా, భవల్‌నగర్, అటాక్,చోర్‌లపై దాడులు జరిగినట్లు చెప్పింది. భారత సైన్యం ప్రెస్ బ్రీఫింగ్‌లో ఈ ప్రదేశాలను పేర్కొనలేదు. దీనిని బట్టి చూస్తే భారత్ చెప్పిన దాని కన్నా పాకిస్తాన్‌లో మరింత విధ్వంసం జరిగినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఎందుకు భారత్‌ని కాల్పుల విరమణకు అభ్యర్థించిందనేది దీనిని చూస్తే అర్థమవుతుంది.

భారత సైన్యం పాకిస్తాన్, పీఓకేలోని బహవల్ పూర్, మురిడ్కేలతో పాటు ముజఫరాబాద్, కోట్లి, రావలకోట్, చక్స్వారీ, భీంబర్, నీలం వ్యాలీ, జీలం మరియు చక్వాల్ ఉగ్రస్థావరాలన నాశనం చేసింది. దీని తర్వాత పాకిస్తాన్ సైన్యం దాడులకు ప్రతీకారంగా, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన 11 వైమానిక స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. భారత దాడుల్లో నూర్ ఖాన్, రఫికి, మురిద్, సుక్కూర్, సియాల్‌కోట్, పస్రూర్, చునియన్, సర్గోధా, స్కారు, భోలారి మరియు జకోబాబాద్ ఎయిర్ బేస్‌లు దెబ్బతిన్నాయి.

Exit mobile version