Site icon NTV Telugu

India on Pak: “పాక్ సొంత ఉగ్రవాదానికే బలవుతోంది”.. దాయాది ఆరోపణలపై భారత్ ఆగ్రహం..

Pakistan Terrorists

Pakistan Terrorists

India on Pak: గతేడాది పాకిస్తాన్‌లో ఇద్దరు ఉగ్రవాదుల్ని గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. అయితే ఈ హత్యల్లో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి ఆరోపించారు. అయితే, పాకిస్తాన్ ఆరోపణల్ని భారత్ తీవ్రంగా ఖండగించింది. పాక్ ఆరోపణలు భారత వ్యతిరేక ప్రచారాన్ని పెంపొందించడానికి తాజా ప్రయత్నమని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.

Read Also: Gyanvapi Case: జ్ఞానవాపి మసీదుకు ముందు అక్కడ పెద్ద హిందూ దేవాలయం ఉంది.. ఏఎస్ఐ సర్వేలో సంచలన విషయాలు..

పాకిస్తాన్ చాలా కాలంగా తీవ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, చట్టవిరుద్ధమైన అంతర్జాతీయ కార్యకలాపాలకు కేంద్రంగా ఉందని, భారతదేశంతో పాటు అనేక విదేశాలు పాకిస్తాన్‌ని బహిరంగంగా హెచ్చరించాయి, దాని సొంత ఉగ్రవాదం, హింస వల్లే అది నాశనం చేయబడుతోందని పలు దేశాలు హెచ్చరించాయని భారత విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘‘పాకిస్తాన్ ఏం విత్తుతుందో అదే పండుతోందని, తన దుశ్చర్యలకు ఇతరులను నిందించడం సమర్థనీయం , పరిష్కారం కాదు’’ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.

గతేడాది పాకిస్తాన్ లోని సియాల్ కోట్, రావత్ కోట్ లో జైష్-ఎ-మహ్మద్ మరియు లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న ఇద్దరు పాకిస్తానీ టెర్రరిస్టుల హత్య జరిగింది. ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని పాక్ విదేశాంగ కార్యదర్శి సైరస్ సజ్జాద్ ఖాజీ ఆరోపించారు.

Exit mobile version