పహల్గామ్‌లో నేరమేధం సృష్టించిన ఉగ్రవాదులు ప్రస్తుతం భారత్‌లోనే ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఒక నిర్ధారణకు వచ్చింది. దక్షిణ కాశ్మీర్‌లోని దట్టమైన అడవుల్లో సేఫ్ జోన్‌లో ఉన్నట్లుగా భావిస్తోంది. స్థానికుల సహకారంతో వీరంతా భద్రంగా ఉన్నట్లుగా అంచనా వేస్తోంది.
అయితే వీరి దగ్గర అత్యంత భద్రత కలిగిన ‘‘ఎన్‌క్రిప్టెడ్’’ (Encrypted) కమ్యూనికేషన్ పరికరాలు ఉన్నట్లుగా భావిస్తోంది. ఇదొక సీక్రెట్ పరికరం. ఈ పరికరాలు సమాచారాన్ని అంత్యంత గోప్యంగా ఉంచుతాయి. సమాచారం గానీ.. డేటా గానీ రహస్య కోడ్‌గా మారిపోతుంది. ఇదొక గూఢ లిపి పరికరం. ఈ పరికరాలు ఉన్న వారికి మాత్రం కోడ్ భాష అర్థమవుతోంది. అంతేకాకుండా సమాచారం కూడా వారికి మాత్రమే అందుతుంది. ఇలాంటి అత్యాధునికమైన పరికరాలు ఉపయోగించడం వల్ల ఉగ్రవాదుల జాడ తెలియడం లేదు. ఈ పరికరాలు అత్యంత భద్రతతో పాటు సమాచారం కూడా చాలా సురక్షితంగా ఉంచుతుంది.
ఇది కూడా చదవండి: Vinay Narwal: ముస్లింలపై నేవీ ఆఫీసర్ భార్య హిమాన్షి కీలక వ్యాఖ్యలు
ఈ పరికరాలు సైనిక ప్రయోజనాల కోసమే ఉపయోగిస్తారు. పురాతన కాలంలో రహస్య సంభాషణను చేరవేయడానికి సైన్యాలు ఉపయోగించేవి. గ్రీస్, రోమ్ ఈ పరికరాలను విరివిగా ఉపయోగించింది. అత్యంత ప్రసిద్ధమైన పరికారాల్లో ఎన్‌క్రిప్టెడ్ ఒక పరికరం. 800 AD ప్రాంతంలో అరబ్ గణిత శాస్త్రజ్ఞుడు అల్ కండి ఈ పరికరాన్ని రూపొందించాడు. ఈ పరికరం అత్యంత సేఫ్ జోన్ అస్త్రంగా చెబుతుంటారు. అందుకే ప్రస్తుతం ఈ పరికరాన్ని వాణిజ్యం, భద్రత, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ బదిలీల కోసం ఉపయోగిస్తుంటారు. సైబర్ దాడులను నిరోధించడానికి ఈ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుంది. దాదాపుగా ప్రపంచంలో 71 శాతం కంపెనీలన్నీ ఈ వ్యవస్థనే ఉపయోగిస్తుంటాయి. దీన్ని సాధారణ ప్రజలు అర్థం చేసుకోలేరు. చూడలేరు. ఈ పరికరంతోనే ఉగ్రవాదులు సురక్షితంగా ఉన్నట్లుగా ఎన్ఐఏ కనిపెట్టింది.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా పెళ్లైన జంటలు.. భర్తలను కోల్పోయారు. మతం పేరుతో ఈ దాడులు చేశారు. కేవలం హిందువులు టార్గెట్‌గా ముష్కరులు చెలరేగిపోయారు. ఇక ఈ దాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది.
ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: భారత్‌లోనే పహల్గామ్ ఉగ్రవాదులు! ఎక్కడున్నారంటే..! ఎన్ఐఏ అంచనా ఇదే!
