Site icon NTV Telugu

Pahalgam Terror Attack: శ్రీనగర్కు బయలుదేరిన హోంమంత్రి అమిత్ షా..

Amithshah

Amithshah

Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఉగ్ర దాడి జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే చాలా మంది పర్యాటకులు మరణించినట్లు తెలుస్తుంది. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఆరా తీసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కాల్ చేసి శ్రీనగర్ వెళ్లాలని సూచించారు. దీంతో హుటాహుటిన ఆయన శ్రీనగర్ కు బయలుదేరి వెళ్తున్నారు. కాగా, శ్రీనగర్ వెళ్లిన తర్వాత అన్ని ఏజెన్సీలతో అత్యవసర భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు అమిత్ షా. కాగా, అంతకుముందు, పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు. ఈ దారుణమైన ఉగ్రవాద చర్యలో పాల్గొన్న వారిని వదిలిపెట్టబోము హెచ్చరించారు. నేరస్థులను కఠినంగా శిక్షిస్తామన్నారు.

Read Also: Fan Wars: ఫ్యాన్ వార్స్ కి టైం అయింది.. ఆఖరికి ఇలా కూడానా?

అయితే, జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడిని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఖండించారు. ఈ వార్త విని తీవ్ర మనో వేదనకు గురయ్యాను.. అమాయక పౌరులపై దాడికి పాల్పడిన వారిని వదిలి పెట్టమని పేర్కొన్నారు. ఈ ఘటన వెనుక ఉన్నవారిని న్యాయస్థానం ముందు నిలబెట్టాలి అని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదంపై పోరాడాలనే మా సంకల్పం అచంచలమైనది.. అది మరింత బలపడుతుంది అని ఆయన వెల్లడించారు.

Exit mobile version