Site icon NTV Telugu

Pahalgam Attack: పహల్గామ్ దాడి తర్వాత 21 మంది ఉగ్రవాదులు ఖతం..

Terrorits

Terrorits

Pahalgam Attack: ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదుల్ని వేటాడి హతమారుస్తు్న్నారు. భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, బీఎస్ఎఫ్ జాయింట్ ఆపరేషన్లలో విజయాలు సాధిస్తున్నారు. విదేశీ, స్థానిక ఉగ్రవాదులపై విరుచుకుపడుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇప్పటి వరకు ఆరు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 21 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల్లో 12 మంది పాకిస్తాన్ పౌరులు కాగా, 9 మంది స్థానిక వాసులు.

ఆపరేషన్ అఖల్:

ఆపరేషన్ అఖల్ కోడ్‌నేమ్‌తో రెండు రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. మరణించిన ఉగ్రవాదుల్లో జాకీర్ అహ్మద్ గని, ఆదిల్ రెహమాన్ డెంటు, హారిస్ దార్ ఉన్నారు.

ఎన్‌కౌంటర్ 1:

సాంభా సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఏడుగురిని బీఎస్ఎఫ్ దళాలు హతమార్చాయి. వీరంతా పాక్ జాతీయులే.

ఎన్‌కౌంటర్ 2:

షొఫియాన్ కెల్లార్ అటవీ ప్రాంతంలో ముగ్గురు కీలక లష్కరే ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఉన్న ఉగ్రవాదులు

1) షాహిద్ కుట్టే – షోపియన్‌లోని చోటిపోరా హీర్‌పోరా నివాసి. మార్చి 8, 2023న ఎల్‌ఇటిలో చేరిన కేటగిరీ-ఎ ఉగ్రవాది. ఇద్దరు జర్మన్ పర్యాటకులు, స్థానిక డ్రైవర్‌ను గాయపరిచిన షోపియన్‌లోని 2024 రిసార్ట్ కాల్పుల కేసులో కుట్టే నిందితుడు. 2024లో హెరాపోరాలో బిజెపి సర్పంచ్ హత్య. ఈ ఫిబ్రవరిలో కుల్గాంలో టెరిటోరియల్ ఆర్మీ జవాను హత్యలో కూడా అతను నిందితుడు.

2. అద్నాన్ షఫీ దార్ – షోపియన్‌లోని వందునా మెల్హోరా నివాసి. అక్టోబర్ 18, 2024న ఎల్‌ఇటిలో చేరాడు. కేటగిరీ-సి ఉగ్రవాది. వలస కార్మికుడి హత్యకు అతను బాధ్యత వహించాడు.

3. అమీర్ బషీర్ – షోపియన్ నుండి. లష్కరేతోయిబా విభాగమైన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) సభ్యుడు. కేటగిరీ-C ఉగ్రవాది. పహల్గామ్ దాడికి TRF బాధ్యత వహించింది.

ఎన్‌కౌంటర్ 3:

త్రాల్‌లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్ మాడ్యుల్ కు చెందిన ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఉగ్రవాదులు వీరే..

1. ఆసిఫ్ అహ్మద్ షేక్ – అవంతిపోరా జిల్లా కమాండర్. కేటగిరీ-C. ఏప్రిల్ 18, 2022 నుండి క్రియాశీలకంగా ఉన్నారు.

2. అమీర్ నజీర్ వాని – ఏప్రిల్ 26, 2024 నుండి క్రియాశీలకంగా ఉన్నారు. కేటగిరీ-C ఉగ్రవాది

3. యావర్ అహ్మద్ భట్ – ఆగస్టు 26, 2024 నుండి క్రియాశీలకంగా ఉన్నారు. కేటగిరీ-C ఉగ్రవాది.

ఎన్‌కౌంటర్ 4:ఆపరేషన్ మహాదేవ్

ఆపరేషన్ మహాదేవ్‌లో భాగంగా జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ముల్నార్ గ్రామంలో ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం చేశారు. సులైమాన్, ఆఫ్ఘన్, జిబ్రాన్‌లు పహల్గామ్ మారణహోమానికి పాల్పడిన వ్యక్తులే అని అధికారులు ధ్రువీకరించారు.

ఎన్కౌంటర్ 5: పూంచ్ – ఆపరేషన్ శివశక్తి

ఈ ఆపరేషన్‌లో ఇద్దరు పాకిస్తానీ లష్కరే ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుపెట్టాయి.

Exit mobile version