Asaduddin Owaisi: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధించి, అధికారంలోకి వస్తే ముస్లిం వ్యక్తే ఉప ముఖ్యమంత్రి అవుతారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అజాద్ సమాజ్వాదీ పార్టీతో ఎంఐఎం పొత్తు పెట్టుకుంది. తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రశేఖర్ ఆజాద్ అని ఓవైసీ ప్రకటించారు. మరో డిప్యూటీ సీఎంగా వెనకబడిన వర్గాలకు చెందిన వ్యక్తిని నియమిస్తామని హామీ ఇచ్చారు. లక్నోలో నిర్వహించిన ఒక సమావేశంలో ఇద్దరు నేతలు ఈ ప్రకటన చేశారు. సభలో మాట్లాడిన చంద్రశేఖర్ ఆజాద్ .. ‘‘ఇకపై అబ్దుల్ చాపలను పడవడు. అబ్దుల్ నా పక్కన కూర్చుని డిప్యూటీ సీఎం అవుతారు’’ అని ముస్లిం వ్యక్తికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెడుతామని చెప్పారు.
ముస్లింలను ఓటు బ్యాంకుగా మాత్రమే ఇతర పార్టీలు చూస్తున్నాయని ఆజాద్ ఆరోపించారు. సమాజ్వాదీ పార్టీని లక్ష్యంగా చేసుకుని గతంలో ఓవైసీ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ జనాభాలో ముస్లింలు 19 శాతం, ఎస్సీలు 21 శాతం ఉన్నారు. వీరిద్దరు కలిస్తే అధికారం సొంతమవుతుందని చంద్రశేఖర్ ఆజార్, అసదుద్దీన్ ఓవైసీలు భావిస్తున్నారు.

