Site icon NTV Telugu

West Bengal: తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో భారీగా నగదు..

West Bengal

West Bengal

Over Rs 10 crore in cash seized from TMC MLA Jakir Hossain’s properties: పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) ఎమ్మెల్యే ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. ఏకంగా రూ. 10 కోట్ల నగదును ఆదాయపు పన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతా, ముర్షిదాబాద్ ప్రాంతాల్లో టీఎంసీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జాకీర్ హుస్సెన్ ఇళ్లలో సోదాలు నిర్వహించింది ఐటీ శాఖ. బుధవారం, గురువారాల్లో మొత్తం 28 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ముర్షిదాబాద్‌లోని రఘునాథ్‌గంజ్‌, సుతీ, సంసెర్‌గంజ్‌లోని ఇల్లు, ఆఫీసులు, రైస్ మిల్లు, బీడీ ఫ్యాక్టరీలల్లో అధికారులు దాడులు నిర్వహించారు. దీంతో పాటు కోల్‌కతా, న్యూఢిల్లీలలో కూడా దాడులు నిర్వహించారు.

Read Also: Hyper Aadi: నా కన్నతల్లిపై ఒట్టు.. పవన్‌ లాంటి నేతను చూడలేరు..

ఇదిలా ఉంటే బీజేపీ కావాలనే తమ పార్టీ నాయకులపై దాడులు నిర్వహిస్తోందని టీఎంసీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ మాట్లాడుతూ.. హెస్సెన్ వ్యాపారవేత్త అని.. పార్టీలో చేరకుముందు పెద్ద ఎత్తున బీడీ వ్యాపారం చేశారని, ఇలాంటి వ్యాపారాలకు కూలీలకు డబ్బులు చెల్లించేందుకు చేతిలో నగదు అవసరం అని.. అందుకే ఆయన వద్ద డబ్బు ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏదైనా తప్పు జరిగితే సంబంధిత సంస్థలు చర్యలు తీసుకుంటాయని..విచారణ జరగాలని..అయితే విచారణ పూర్తికాకముందే ఈ డబ్బు అక్రమం అని చెప్పడం తప్పని అన్నారు. ఇటీవల టీఎంసీకి చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు వివిధ కేసుల్లో ఇరుక్కున్నారు. ఇది సీఎం మమతాబెనర్జీకి ప్రతిబంధకంగా మారింది. గతంలో టీఎంసీ మాజీ సెక్రటరీ జనరల్, మాజీ మంత్రి పార్థ ఛటర్జీ ఇంట్లో ఈడీ పెద్ద మొత్తంలో కరెన్నీ నోట్లను స్వాధీనం చేసుకుంది.

Exit mobile version