Site icon NTV Telugu

India Pakistan: 600కి పైగా పాక్ డ్రోన్లను కూల్చిన భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్..

India Pakistan

India Pakistan

India Pakistan: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుంది. భారత్ వద్ద ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అత్యంత సమర్థవంతంగా పనిచేశాయి. భారత వాయు రక్షణ వ్యవస్థలు 600 కంటే ఎక్కువ పాకిస్తానీ డ్రోన్లను కుప్పకూల్చాయి. అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వద్ద 1000 కంటే ఎక్కువ యాంటీ-ఎయిర్ క్రాఫ్ట్ గన్స్‌ని భారత్ మోహరించింది. వీటి ద్వారా పాకిస్తాన్‌ని చావు దెబ్బ తీసింది. పెద్ద వైమానిక దాడుల్ని ఎదుర్కొనేందుకు సర్ఫేజ్ టూ ఎయిర్ (SAM) క్షిపణి వ్యవస్థల్ని రంగంలోకి దించింది. ఇలా పలు అంచెలుగా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ యాక్టివ్ చేయడంతో పాకిస్తాన్‌కి పరాభవం తప్పలేదు. స్వదేశీ టెక్నాలజీ తయారు చేయబడిని ‘‘ఆకాష్ తిర్’’ గగనతల రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసింది.

భారతదేశ వైమానిక రక్షణలో కీలకమైన భాగాలు:

L-70 ఎయిర్ డిఫెన్స్ గన్: 1970లో స్వీడన్ నుంచి కొనుగోలు చేసిన L-70 ఎయిర్ డిఫెన్స్ గన్‌కి భారత్ అప్‌గ్రేడ్ చేసి, అధునాతన హైరిజల్యూషన్ సెన్సార్లు, కెమెరాలు, రాడార్ వ్యవస్థను మర్చింది. ఇది 3-4 కి.మీ పరిధిలోని వైమానిక ముప్పును పసిగట్టి నిమిషానికి 300 రౌండ్లు కాల్పులు జరుపుతుంది. పగలు, రాత్రి వేళల్లో ఇది పనిచేస్తుంది.

Zu-23mm గన్: 1980లలో రష్యా నుంచి కొనుగోలు చేసిన ఈ ట్విన్ బారెల్ గన్ మొత్తంగా నిమిషానికి 3200-4000 రౌండ్లు పేల్చగలుగుతుంది. దీనిని మాన్యువల్‌గా ఆపరేట్ చేస్తారు. ఇది 2-2.5 కి.మీ పరిధిలోని డ్రోన్లను నాశనం చేస్తుంది.

శిల్కా గన్ సిస్టమ్: ఈ వ్యవస్థ ట్విన్ 23 ఎంఎం కానన్స్ కలిగి ఉంటుంది. ఇది ఆటోమెటిక్‌గా పనిచేస్తుంది. శిల్కా సిస్టమ్ నిమిషానికి 8000 రౌండ్లు కాల్పులు జరుపుతుంది.

వీటిలో పాటు సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ సిస్టమ్స్, ఎస్-400, బారక్-8, ఆకాష్ క్షిపణి వ్యవస్థలు భారత్‌లోకి వచ్చే వైమానికి దాడుల్ని సమర్థవంతంగా అడ్డుకున్నాయి.

Exit mobile version