NTV Telugu Site icon

Amarnath Yatra: లక్ష దాటిన అమర్‌నాథ్ యాత్రికుల సంఖ్య..

Amarnath

Amarnath

Amarnath: హిందువులు ఎంతో ప్రతిష్టాత్మకం భావించే అమర్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని బుధవారం 30,000 మందికి పైగా యాత్రికులు దర్శించుకున్నారు. ఇప్పటి వరకు మంచు లింగాన్ని దర్శించుకున్న వారి సంఖ్య 1 లక్షలను దాటినట్లు అధికారులు వెల్లడించారు. అమర్‌నాథ్ యాత్రం శనివారం నుంచి జంట మార్గాల ద్వారా ప్రారంభమైంది. అనంత్‌నాగ్‌లోని 48 కి.మీ నున్వాన్-పహల్గామ్ మార్గం, గందర్‌బాల్‌లోని 14 కి.మీ బల్తాల్ మార్గాల గుండా యాత్రికులు శివుడిని సందర్శించుకున్నారు.

Read Also: Bhubaneswar: తల్లి ముందే తండ్రిని చంపిన లా కాలేజీ ప్రొఫెసర్

3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ క్షేత్రాన్ని దర్శించుకున్న యాత్రికుల సంఖ్య 1,05,282కి చేరుకుందని అధికారులు తెలిపారు. ఈఏడాది ఇప్పటివరకు యాత్రలో ఇద్దరు భక్తులు మరణించారు. వీరిద్దరు హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. బాల్టాల్ మార్గంలో అమర్‌నాథ్ వెళ్తున్న సమయంలో గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. 52 రోజుల పాటు సాగే ఈ అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 19న ముగుస్తుంది. గతేడాది 4.5 లక్షల మంది యాత్రికులు మంచు లింగాన్ని దర్శించుకున్నారు.